దివాళా అంచుల్లో క్రెడిట్ సూయిస్ బ్యాంకు..యూరప్‌ను తాకిన అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం..

Published : Mar 16, 2023, 07:03 PM IST
దివాళా అంచుల్లో క్రెడిట్ సూయిస్ బ్యాంకు..యూరప్‌ను తాకిన అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం..

సారాంశం

బ్యాంకింగ్ సంక్షోభం కేవలం అమెరికాకే పరిమితం కాకుండా యూరప్‌లోనూ తీవ్రరూపం దాల్చుతోంది. యూరప్‌లోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన క్రెడిట్ సూయిస్ కూడా దివాళా అంచుల్లో  ఉంది. ఒక్క రోజులో దీని షేర్లు 25 శాతం పడిపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వేత్తలు  ఆందోళన చెందుతున్నారు. 

యుఎస్‌లో మూడు బ్యాంకులు కుప్పకూలిన తర్వాత, ఇప్పుడు యూరప్ కు చెందిన ప్రముఖ బ్యాంకు క్రెడిట్ సూయిస్ వంతు వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే టాప్ బ్యాంకుల్లో క్రెడిట్ సూయిస్ 8వ స్థానంలో ఉన్న ఈ బ్యాంకు దివాళా తీసే అవకాశంలు ఉన్నాయని ప్రముఖ పెట్టుబడి నిపుణుడు, రిచ్ డాడ్, పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి అన్నారు. యూరప్ లోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన  క్రెడిట్ సూయిస్ దివాళా తీస్తే  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

2008లో ఆర్థిక సంక్షోభానికి ముందు లెమాన్ బ్రదర్స్ బ్యాంకు దివాళా తీస్తుందని రాబర్ట్ కియోసాకి అందరి కంటే ముందే అంచనా వేశారు. ఆయన చెప్పినట్లుగా లెమాన్ బ్రదర్స్ పతనం ప్రపంచ మాంద్యానికి మూల కారణమయ్యింది. ప్రస్తుతం క్రెడిట్ సూయిస్ బ్యాంక్ కుప్పకూలే అవకాశం ఉందని, ఇది ఆందోళన కలిగిస్తోందని ఆయన ఓ టీవీ ఇంటర్వ్యూలో అన్నారు.

నష్టాల్లో క్రెడిట్ సూయిస్ బ్యాంక్:

గత కొంతకాలంగా క్రెడిట్ సూయిస్ బ్యాంక్ నిరంతరం సవాళ్లను ఎదుర్కొంటోంది. షేరు ధరలో నిరంతర పతనం కారణంగా, బ్యాంక్ వాటాదారులు కూడా నెమ్మదిగా వదిలివేయడం ప్రారంభించారు. 9.9 శాతం వాటాతో స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్ సూయిస్ బ్యాంక్‌లో అతిపెద్ద వాటాదారు సౌదీ నేషనల్ బ్యాంక్ (SNB) తదుపరి పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరించింది. 

అనేక ఆర్థిక అవకతవకల ఆరోపణల కారణంగా 2021 తర్వాత క్రెడిట్ సూయిస్ బ్యాంక్ తన మార్కెట్ విలువలో 80% కోల్పోయింది. ఇప్పుడు ఈ బ్యాంకుకు బాండ్ మార్కెట్‌లో చాలా డబ్బు ఉంది. అయితే అమెరికా బాండ్ మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉంది. అమెరికాలో స్టాక్ మార్కెట్ కంటే బాండ్ మార్కెట్‌లో ఎక్కువ  డబ్బు ఉంటుంది. బాండ్ మార్కెట్ పడిపోతే క్రెడిట్ సూసీ కూడా పడిపోతుందని అంటున్నారు.

అమెరికన్ డాలర్ ఇప్పుడు విలువను కోల్పోతోంది. కాబట్టి ప్రభుత్వం మరింత ఎక్కువ డాలర్లను ముద్రిస్తోందని అది మరిన్ని సమస్యలను సృష్టిస్తుంది' అని కియోసాకి చెప్పారు.కియోసాకి ప్రకటించిన కొన్ని గంటల్లోనే, క్రెడిట్ సూయిస్ బ్యాంక్ తన ఆర్థిక నివేదికలలో "గణనీయమైన లోటులో" ఉందని అంగీకరించింది.

క్రెడిట్ సూయిస్ షేర్ 30 శాతం పతనం

బ్యాంక్ ఆఫ్ అమెరికా పతనం తర్వాత బుధవారం స్టాక్ మార్కెట్ కూడా పడిపోయింది. డౌ జోన్స్ బుధవారం 500 పాయింట్లు పడిపోయింది.  క్రెడిట్ సూయిస్ షేర్లు కూడా 50% పడిపోయాయి. 30 శాతం పడిపోయింది. స్టాక్‌కు ఇది రికార్డు కనిష్ట స్థాయి. ఇదిలా ఉండగా, యాక్సిస్ బ్యాంక్‌లో చేరేందుకు క్రెడిట్ సూసీ ఆసియా-పసిఫిక్ కో-హెడ్ నీలకంఠ మిశ్రా రాజీనామా చేశారు.

ఇదిలా ఉంటే బ్యాంకింగ్ రంగంలో అమెరికా సునామీ ఇప్పుడు యూరోపియన్ బ్యాంకులను తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులపై కనిపిస్తోంది. యుఎస్‌లో, సిలికాన్ వ్యాలీ, సిగ్నేచర్ బ్యాంక్ దివాళా తీశాయి. దాదాపు అర డజను ఇతర US బ్యాంకులు దివాలా తీసే ప్రమాదంలో ఉన్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు