అన్ని పరీక్షలు చాట్ జీపీటీ రాసేస్తే...ఇక మనుషులు ఏం చేయాలి.. చాట్ జీపీటీ-4పై టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ అసహనం..

By Krishna AdithyaFirst Published Mar 16, 2023, 4:26 PM IST
Highlights

మానవ మేధస్సుతో రాయాల్సిన అన్ని పరీక్షలను చాట్ జిపిటి రాసేస్తే ఇక మనుషులు చేయాల్సింది ఏముందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ విమర్శించారు. తన దగ్గర 10 కోట్ల విరాళం తీసుకొని ప్రారంభించిన ఓపెన్ ఏఐ నేడు ఒక డబ్బులు సంపాదించే సంస్థగా మారిపోయిందని దీనితో ఎలాంటి లాభం లేదని విమర్శించారు.

AI చాట్‌బాట్ CHAT GPT వేగంగా విస్తరిస్తోంది. దాని ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ఈ పెరుగుతున్న ప్రజాదరణ అనేక పెద్ద టెక్ కంపెనీలకు, వాటి యజమానులకు నిద్రలేకుండా చేస్తోంది. ఇప్పుడు ఆ కోవలోకి ఎలాన్ మస్క్ కూడా వచ్చి చేరారు. రోజు రోజుకీ పెరుగుతన్న చాట్ GPT జనాదరణతో ఆయన ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా చాట్ జీపీటీ అప్ డేటెడ్ వర్షన్ జీపీటీ 4 పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

GPT-4 ప్రకటన తర్వాత, Twitter CEO ఎలోన్ మస్క్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఆర్టిఫిసియల్ ఇంటెలిజన్స్ చాట్ బాట ఇలా SAT, GRE వంటి కఠినమైన పరీక్షలను రాసేస్తే, ఇక మనుషులకు ఏం పని ఉంటుందని విమర్శించారు.  ఇది కొనసాగితే, మానవులకు ఏమి మిగిలి ఉంటుంది? దీనికి ప్రత్యామ్నాయం తాను తయారు చేస్తున్న ప్రాజెక్ట్ న్యూరాలింక్‌ని చూపిస్తుందని చెప్పుకొచ్చారు. , 'మేము న్యూరాలింక్‌తో ముందుకు వెళ్తాము' అని మాస్క్ ప్రకటించారు. వాస్తవానికి, న్యూరాలింక్ అనేది ఎలోన్ మస్క్ సాంకేతిక సంస్థ, ఇది మెదడులో అమర్చబడే చిప్‌ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. ఈ చిప్ ద్వారా ప్రజల మెదడును నియంత్రించవచ్చు. ప్రస్తుతం కంపెనీ ఈ చిప్‌ని జంతువులపై పరీక్షిస్తోంది.

ఎలోన్ మస్క్, చాట్ Gpt కనెక్షన్?

మస్క్ ఈ కృత్రిమ మేధస్సు సాంకేతికతను విమర్శించినప్పటికీ, అతను స్వయంగా దాని మాతృ సంస్థ అంటే ఓపెన్ AI వ్యవస్థాపకులలో ఒకడు.సంస్థకు ఆయన రూ. 10 కోట్ల విరాళం సైతం ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ కంపెనీ లాభాపేక్షతో పనిచేసే సంస్థగా మారిపోయిందని విమర్శించారు. అంతేకాదు.. మస్క్ చాట్ GPT లాంటివి భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారతాయని అన్నారు. అందుకే వాటిని చాలా కంట్రోల్‌గా వాడాలని సూచించారు. 

చాట్ Gpt 4 పనితీరు ఎలా ఉంది..

GPT4 చాట్ అనేది GPT అప్‌గ్రేడ్ వెర్షన్. ఇది ప్రతి ప్రశ్నకు వివరణాత్మక సమాచారంతో సమాధానం ఇస్తుంది. ఇది బహుళ భాషలను మాట్లాడగలదు. సృజనాత్మక, సాంకేతిక రచన అసైన్‌మెంట్‌లను రాయగలదు, సవరించగలదు ఉత్పత్తి చేయగలదు. కొత్త చాట్‌బాట్ ఇప్పటికే GRE, LSAT, SATలు మరిన్నింటితో సహా వివిధ పరీక్షలను కూడా ఈజీగా పాస్ అవుతోంది. 

న్యూరాలింక్ అంటే ఏమిటి?

న్యూరాలింక్ అనేది ఎలోన్ మస్క్ కంపెనీ. ఈ కంపెనీ మెదడులో అమర్చే విధంగా చిప్‌లను తయారు చేస్తోంది. ఈ చిప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మానవ మనస్సును నియంత్రించవచ్చు.  మస్క్ కొన్ని సంవత్సరాల క్రితం కంపెనీని స్థాపించారు. ఇది అల్జీమర్స్ , పార్కిన్సన్స్ వంటి మెదడు వ్యాధులను నయం చేయగలదని పేర్కొన్నారు.

click me!