విజయ్ మాల్యా అప్పగింతపై సస్పెన్స్.. 6 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని కోరిన సుప్రీంకోర్టు

Ashok Kumar   | Asianet News
Published : Nov 02, 2020, 04:09 PM ISTUpdated : Nov 02, 2020, 04:10 PM IST
విజయ్ మాల్యా అప్పగింతపై సస్పెన్స్.. 6 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని కోరిన సుప్రీంకోర్టు

సారాంశం

యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రత్యేక చట్టపరమైన ప్రక్రియ జరిగే వరకు విజయ్ మాల్యాను భారతదేశానికి రప్పించలేమని కేంద్రం అక్టోబర్ 5న సుప్రీం కోర్టుకు తెలిపింది. జస్టిస్ యు యు లలిత్, అశోక్ భూషణ్ ధర్మాసనం ఆరు వారాల్లో ఈ విషయంపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది.  

న్యూ ఢీల్లీ: మాజీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బాస్, విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించడం కోసం యునైటెడ్ కింగ్‌డమ్‌లో పెండింగ్‌లో ఉన్న చర్యలపై ఆరు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని కోరింది.

 యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రత్యేక చట్టపరమైన ప్రక్రియ జరిగే వరకు విజయ్ మాల్యాను భారతదేశానికి రప్పించలేమని కేంద్రం అక్టోబర్ 5న సుప్రీం కోర్టుకు తెలిపింది.

జస్టిస్ యు యు లలిత్, అశోక్ భూషణ్ ధర్మాసనం ఆరు వారాల్లో ఈ విషయంపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది, వచ్చే ఏడాది జనవరి మొదటి వారం నాటికి  విచారణ పోస్ట్ చేసింది. సుప్రీం కోర్టులో మాల్యా తరఫు న్యాయవాది ఇ సి అగర్వాలా పిటిషన్ను అంగీకరించడానికి ధర్మాసనం నిరాకరించింది.

also read ఇండియాలో ప్రీ కోవిడ్-19 స్థాయికి పెట్రోల్, డీజిల్ అమ్మకాలు.. సెప్టెంబరుతో పోలిస్తే 8.6% ఎక్కువ.. ...

విజయ్ మాల్యాను భారతదేశానికి రప్పించే అవకాశం ప్రస్తుతం లేదని యుకె ప్రభుత్వం సూచించింది, ఇందుకు చట్టబద్దమైన సమస్యలు  ఉన్నాయని, అతనిని రప్పించే ముందు వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

బ్రిటన్‌లో జరుగుతున్న రహస్య కార్యకలాపాల గురించి తెలియదని, దీనివల్ల మాల్యా రప్పించడం ఆలస్యం అయిందని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. విజయ్ మాల్యా తరపు న్యాయవాది స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవటంతో కోర్టు మందలించింది.

విచారణను నవంబర్ 2 వరకు వాయిదా వేసింది. విజయ్ మాల్యా తరపున న్యాయవాదులను నవంబర్ 2లోగా మాల్యా కోర్టుకు ఎప్పుడు హాజరురవుతాడు, రహస్య చర్యలు ఎప్పుడు ముగుస్తాయో తెలపాలని సుప్రీంకోర్టు అంతకుముందు కోరింది.

కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం బ్యాంకుల నుండి తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను చెల్లించని కేసులో విజయ్ మాల్యా నిందితుడు. ప్రస్తుతం విజయ్ మాల్యా మార్చి 2016 నుండి యు.కెలో ఉంటున్నారు.  

PREV
click me!

Recommended Stories

Top 10 Companies : ఇండియాలో టాప్ 10 కంపెనీలు ఇవే... మార్కెట్ క్యాప్‌లో కింగ్ ఎవరు?
NPS Scheme: ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి.? ఏ డాక్యుమెంట్స్ కావాలి