భార్య కోరిక.. ఇంటిపైకి ఎక్కిన స్కార్పియో కారు.. ఆనంద్ మహీంద్ర ట్వీట్..

By Sandra Ashok KumarFirst Published Oct 31, 2020, 4:51 PM IST
Highlights

ఇంతసార్ ఆలం మహీంద్రా స్కార్పియో ఆకారంలో వాటర్ ట్యాంక్ తన ఇంటిపై నిర్మించాడు. స్కార్పియో ఆకారంలో వాటర్ ట్యాంక్ కట్టడానికి ఒక కధ కూడా ఉంది. 

బీహార్ రాష్ట్రం భగల్పూర్ ఇంతసార్ ఆలం మహీంద్రా స్కార్పియో ఆకారంలో వాటర్ ట్యాంక్ తన ఇంటిపై నిర్మించాడు. స్కార్పియో ఆకారంలో వాటర్ ట్యాంక్ కట్టడానికి ఒక కధ కూడా ఉంది. ఇంతసార్ ఆలంకి ఒకప్పుడు మహీంద్రా స్కార్పియో కారు ఉండేది.

ఇది అతని మొదటి కారు. ఈ కారు అంటే అతనికి ఎంతో ఇష్టం. అయితే ఇంతసార్ ఆలం ఇంకొంచెం క్రియేటివ్‌గా ఆలోచించి తనకెంతో ఇష్టమైన మహీంద్రా స్కార్పియో కారుపై ప్రేమను ప్రత్యేకంగా చాటుకున్నారు.

అందుకే పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రని స్కార్పియో ఆకారంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. 

స్కార్పియో వాటర్ ట్యాంక్ కథ ఏమిటి?

ఇంతసార్ ఆలం తన మొదటి కారు మహీంద్రా స్కార్పియోపై తనకున్న ప్రేమను చాటుకోవడానికి, స్కార్పియో ఆకారంలో తన నివాసం పైన వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా స్కార్పియో వాటర్ ట్యాంక్ కు నంబర్ ప్లేట్‌ కూడా ఉందని తెలుస్తుంది.

also read ఎయిర్‌ ఇండియా చరిత్రలో మొట్టమొదటి మహిళా సీఈఓగా హర్‌ప్రీత్‌ సింగ్‌.. ...

అసలు ఈ ఆలోచన ఎలా ప్రారంభమైంది?

స్కార్పియో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడానికి వెనుక ఉన్న ఆలోచన ఇంతసార్ భార్య. ఆమె ఆగ్రాలో ఇలాంటిదే చూసి దాని గురించి తన భర్తకు చెప్పింది. దీంతో ఇంతసార్ కూడా అదే విధంక స్కార్పియో వాటర్ ట్యాంక్ తన ఇంటిపైన ఏర్పాటు చేశాడు.

స్కార్పియో వాటర్ ట్యాంక్ ఖర్చు ఎంతంటే ?

భగల్పూర్ లోని తన ఇంటిపై స్కార్పియో వాహనం లాంటి వాటర్ ట్యాంక్‌ను రూపొందించమని ఆగ్రాకు చెందిన ఒకరిని కోరినట్లు ఇంతసార్ ఆలం ప్రాంతీయ పోర్టల్‌లకు చెప్పారు. దీని నిర్మాణం కోసం సుమారు రూ.2.5 లక్షలు ఖర్చు చేశారట.

ఆనంద్ మహీంద్రా రియాక్ట్స్
 మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇంతసార్ ఆలోచన చూసి మురిసిపోయారు. ట్విట్టర్‌ పోస్ట్‌లో ఆనంద్ మహీంద్రా, "ఇప్పుడు నేను దీనిని రైజ్ స్టోరీ అని పిలుస్తాను.. మహీంద్రా స్కార్పియో అంత ఎత్తుకు చేరింది. అతని మొదటి కారు పట్ల ఆయనకున్న అభిమానానికి మేము సలామ్‌ చేస్తున్నాం!" అంటూ అతనిపై ప్రశంసలు కురిపించారు.

click me!