ముహమ్మద్ రఫీ పాటతో ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్నా చోటా రఫీ.. సోషల్ మీడియాలో వైరల్..

By Sandra Ashok KumarFirst Published Sep 14, 2020, 3:08 PM IST
Highlights

 కేరళకు చెందిన ఒక వ్యక్తి మొహమ్మద్ రఫీ పాడిన గొప్ప పాటల నుంచి ఒక పాట పాడుతున్న వీడియో ఇంటర్నెట్‌ను ఆశ్చర్యపరిచింది. 1969లోని  చిరాగ్ చిత్రం నుండి 'తేరి అంఖోన్ కే శివా' అనే పాటను సౌరవ్ కిషన్ పాడుతున్నా వీడియో వేలాది మంది ట్విట్టర్ వినియోగదారులను ఆకట్టుకుంది.

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటాడు. తాజాగా మరోసారి ఆనంద్ మహీంద్ర చేసిన ట్విట్టర్ పోస్ట్ వైరల్ అయ్యింది. కేరళకు చెందిన ఒక వ్యక్తి మొహమ్మద్ రఫీ పాడిన గొప్ప పాటల నుంచి ఒక పాట పాడుతున్న వీడియో ఇంటర్నెట్‌ను ఆశ్చర్యపరిచింది.

1969లోని  చిరాగ్ చిత్రం నుండి 'తేరి అంఖోన్ కే శివా' అనే పాటను సౌరవ్ కిషన్ పాడుతున్నా వీడియో వేలాది మంది ట్విట్టర్ వినియోగదారులను ఆకట్టుకుంది. అందులోని వారిలో వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు.

కేరళ కోజికోడ్‌కు చెందిన సౌరవ్ కిషన్‌ను స్థానికంగా ఉండేవారు అతనిని "చోటా రఫీ" అని పిలుస్తారు. ఎందుకంటే అతని స్వరం  చాలా మందికి మొహమ్మద్ రఫీని గుర్తు చేస్తుంది. మొహమ్మద్ రఫీ భారతదేశంలో అత్యుత్తమ గాయకుడిగా పరిగణించే లేజెండరి సింగర్.

మూడు రోజుల క్రితం ట్విట్టర్ యూజర్ జుడిష్ రాజ్ పోస్ట్ చేసిన తరువాత సౌరవ్ కిషన్ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. సౌరవ్ కిషన్ 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడూ ఒక వేదిక కార్యక్రమంలో మొహమ్మద్ రఫీ పాటను పాడాడు.

also read 

ఈ కార్యక్రమానికి మలయాళ సంగీత దర్శకుడు దివంగత జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతను సౌరవ్ పాటను విన్నాక అతని తండ్రితో సౌరవ్ కిషన్ ని మొహమ్మద్ రఫీ పాటలపై దృష్టి పెట్టనివ్వండి" అంటు అభినందించారు.

ప్రపంచం ఎదురుచూస్తున్న "కొత్త మొహమ్మద్ రఫీ" కేరళకు చెందిన వ్యక్తి సౌరవ్ కిషన్ అంటు ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌ ద్వారా ప్రశంసించారు. "మేము కొత్త మొహమ్మద్ రఫీ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నాము.

మనం ఇక వేచి ఉండాల్సిన అవసరం లేన్నట్లు అనిపిస్తుంది. ఈ క్లిప్‌ను చూస్తున్నప్పుడు నేను స్విచ్ ఆఫ్ చేయలేకపోయాను" అంటు ఆనంద్ మహీంద్రా తన 8 మిలియన్ల ఫలోవర్స్ తో వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.

ట్విట్టర్‌లో ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుండి 1.2 మిలియన్ల వ్యూస్, వందలాది కామెంట్స్ సంపాదించింది. హీరో, నిర్మాత నిఖిల్ ద్వివేది కూడా సౌరవ్ కిషన్ ను ప్రశంసించారు. 

 

We have been waiting for decades for a new Mohammed Rafi. It sounds as if we may have to wait no longer... I couldn’t switch this clip off... https://t.co/QhM3koPlVE

— anand mahindra (@anandmahindra)
click me!