రిలయన్స్, జియోలో లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు.. పన్ను చెల్లించకుండా ఎలా సేకరించాయి..

By Sandra Ashok KumarFirst Published Sep 14, 2020, 12:15 PM IST
Highlights

 రిలయన్స్ ఇండస్ట్రీస్, టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోలో గత కొంత కాలంగా భారీగా పెట్టుబడులను సాధించింది. అయితే ఈ పెట్టుబడులపై కొందరికి సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

రిలయన్స్  ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్, టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోలో గత కొంత కాలంగా భారీగా పెట్టుబడులను సాధించింది.

అయితే ఈ పెట్టుబడులపై కొందరికి సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. పన్నులు చెల్లించకుండా రిలయన్స్ నిధులను ఎలా సమకూర్చుకోగలిగింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మందికి చర్చించనియాంశంగా మారింది.

రిలయన్స్ ఏం చేసింది?
గత ఏప్రిల్ నుంచి రిలయన్స్ సుమారు రూ .1.5 లక్షల కోట్లు పెట్టుబడులను వసూలు చేసిన సంగతి మనందరికీ తెలుసు. చాలామంది పెట్టుబడులపై పన్ను చెల్లించకుండా ఎలా అని ఆశ్చర్యపడటం సహజం. ఈ విషయంలో రిలయన్స్ ఏం చేసిందో అర్థం చేసుకోవడానికి, మొదట సంస్థ రూపకల్పనపై మంచి అవగాహన ఉండాలి.

రిలయన్స్ వేరు, జియో వేరు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఒక సంస్థ. టెలికాం రంగం జియో ప్లాట్‌ఫాం అనేది  వేరే సంస్థ. రిలయన్స్ నిధులు సేకరించినట్లు చెబుతున్నప్పటికీ, విదేశీ పెట్టుబడిదారులు జియో ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టారు. విదేశీ పెట్టుబడిదారులు సంస్థలో 33% వాటాను కలిగి ఉన్నారు.

also read కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ : 22 వేల కోట్లకు డీటీహెచ్‌ ఆదాయం.. ...

సుమారు ఏడాది క్రితం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌ను సృష్టించింది. కంపెనీ ఈక్విటీలలో రూ.4,961 కోట్లు పెట్టుబడి పెట్టింది. 1.77 లక్షల కోట్లు జియో ప్లాట్‌ఫామ్‌లో ఓబిసిఎస్ ద్వారా పెట్టుబడి పెట్టారు. ఈ విలువ కోసం బాండ్లు జారీ చేయబడింది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఈ బాండ్లను తరువాత వాటాలుగా మార్చవచ్చు.

విదేశాల నుండి నిధులు 
రిలయన్స్ నిధులు సేకరిస్తున్నట్లు వార్తలు వచ్చిన వెంటనే రిలయన్స్ బాండ్లను షేర్లుగా మార్చి షేర్లను విదేశీ పెట్టుబడిదారులకు విక్రయిస్తుంది. అలా అమ్మిన షేర్లపై పన్ను చెల్లింపు పై రిలయన్స్ ఒక ఆలోచన వచ్చింది. జియో ప్లాట్‌ఫామ్ కొత్త షేర్లను విక్రయించడం ద్వారా నిధులను సేకరిస్తోంది. ఆ నిధులను ఉపయోగించి రిలయన్స్ తన పెట్టుబడిని ఓబిసిఎస్ బాండ్ల ద్వారా ఉపసంహరించుకుంటుంది.

పెట్టుబడిపై వచ్చిన మొత్తానికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా, ఈ వాటాల అమ్మకంపై విదేశీ పెట్టుబడిదారులు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఒక నియమం ఉంది. అందుకే జియో ప్లాట్‌ఫామ్‌కు అవసరమైన పెట్టుబడులను విదేశాల నుంచి కంపెనీ అందుకుంది.

ఈ వాటాలను దేశీయ పెట్టుబడిదారులకు విక్రయించినట్లయితే, రిలయన్స్ లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకని, రిలయన్స్ సరైన అవగాహన, చట్టం ప్రకారం పెట్టుబడులను పొందింది.

జియో ప్లాట్‌ఫామ్ కూడా కొత్తగా వేల కోట్ల రూపాయలను  పెట్టుబడులను పొందింది. పన్నుల విషయంలో ప్రభుత్వ నిబంధనలు చాలా ఉన్నాయి. చట్టపరమైన నియమాలను సరిగ్గా చదివి అర్థం చేసుకుని సమర్థవంతంగా వ్యవహరిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది !

click me!