అమెజాన్ బంపర్ ఆఫర్ :20వేల విలువైన ఫోన్ 10వేలకే...

By Sandra Ashok KumarFirst Published Nov 12, 2019, 3:08 PM IST
Highlights

అమెజాన్ లో నోకియా కంపెనీకి చెందిన నోకియా 6.1ప్లస్ రూ.20వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ.9,999కే విక్రయిస్తున్నారు. ఇంకా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తించనున్నాయి. అసలు ఈ ఫోన్ వివరాలు ఇంకా ఆఫర్ గురించి మీకోసం.

ఫిన్ లాండ్ కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ నోకియా మరో స్మార్ట్ ఫోన్ పై ధరను భారీగా తగ్గించింది. సుమారు 20 వేలు ధర ఉన్న విలువైన నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ.9,999కే అమెజాన్ ఆన్ లైన్లో లభిస్తుంది. ఈ ఫోన్ పై రూ.10,500 తగ్గింపు లభించనున్నది.

ఈ స్మార్ట్ ఫోన్ గత సంవత్సరం సెప్టెంబర్ లో మార్కెట్లోకి విడుదల అయింది. అయితే 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అమెజాన్ లో రూ.9,999గా ఉంది. అదే ఫ్లిప్ కార్ట్ లో చూసినట్లయితే ఆశ్చర్యకరంగా 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.12,290గానూ, 4 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.15,999గానూ ఉంది. ఇంత తక్కువ ధరకు లభిస్తుందంటే ఇది పారేయదగ్గ ఫోన్ కూడా కాదు. ఇందులో కూడా అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి...

also read బోగస్ పేర్లతో కాంట్రాక్టులు:వెలుగులోకి 33వేల కోట్ల హవాలా రాకెట్‌

ఇందులో 5.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. యాస్పెక్ట్ రేషియో 19:9గా ఉన్న నాచ్ తో కూడిన డిస్ ప్లే ఇందులో ఉంది. స్క్రీన్ రిజల్యూషన్ 2280x1080 పిక్సెల్స్ గా ఉంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 636 ఆక్టాకోర్ ప్రాసెసర్ ను అందించారు.

ఇందులో వెనకవైపు 16 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాను అందించారు. సెల్ఫీ ప్రియుల కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న ఏఐ కెమెరా కూడా ఉంది.ఇందులో 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. 400 జీబీ వరకు మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

దీని బ్యాటరీ సామర్థ్యం 3060 ఎంఏహెచ్ గా ఉంది. ఇందులో ఉన్న హైబ్రిడ్ సిమ్ స్లాట్ ద్వారా రెండు సిమ్ కార్డులను ఇందులో వేసుకోవచ్చు. ఈ ఫోన్ పొడవు 14.72 సెంటీమీటర్లు కాగా, వెడల్పు 7.09 సెంటీమీటర్లుగానూ, మందం 0.79 సెంటీమీటర్లుగానూ ఉంది. దీని బరువు చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది కేవలం 151 గ్రాముల బరువు మాత్రమే ఉంది.

aslo read జొమాటో కస్టమర్లకు ఫ్రీ వాలెట్ పార్కింగ్......

ఇందులో ఫింగర్ ప్రింట్ ఫీచర్ కూడా ఉంది. వైఫై, జీపీఎస్, బ్లూటూత్ 5.0, యూఎస్ బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్ సెన్సార్లను కూడా నోకియా 6.1లో అందించారు.


అంతేకాకుండా హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.500 వరకు ధర తగ్గింపు లభిస్తుంది. హెచ్‌ఎస్‌బి‌సి క్యాష్ బ్యాక్ కార్డుతో కొనుగోలు చేస్తే 5% శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్  కూడా అందిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం వరకు డిస్కౌంట్ కూడా ఇందులో లభిస్తుంది.
 

click me!