అమెరికాకు అలీబాబా వ్యవస్థాపకుడి భారీ విరాళం....

By Sandra Ashok KumarFirst Published Mar 14, 2020, 5:01 PM IST
Highlights

కరోనా వైరస్  టెస్ట్ కిట్ల కొరత కారణంగా వైరస్ పరీక్ష మందగించడంపై అమెరికా ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైంది. చైనా బిలియనీర్ వ్యాపారవేత్త జాక్ మా శుక్రవారం యునైటెడ్ స్టేట్స్ కోసం 500,000 కరోనావైరస్ టెస్ట్ కిట్లు, ఒక మిలియన్ మాస్క్‌లను అందించారు.

బీజింగ్: ప్రాణాంతక వ్యాధిని నిర్ధారించడానికి దేశం కరోనా వైరస్ కిట్ల కొరతను ఎదుర్కొంటున్నందున, చైనా బిలియనీర్ వ్యాపారవేత్త జాక్ మా శుక్రవారం యునైటెడ్ స్టేట్స్ కోసం 500,000 కరోనావైరస్ టెస్ట్ కిట్లు, ఒక మిలియన్ మాస్క్‌లను అందించారు.

ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు, " కరోనా వైరస్ పరీక్ష చేయడానికి వేగవంతమైన, ఖచ్చితమైన పరీక్ష చేయడానికి వైద్య నిపుణులకు తగిన రక్షణ పరికరాలు వైరస్ వ్యాప్తిని నివారించడంలో అత్యంత ప్రభావవంతమైనవి" అని అన్నారు.

also read రాణా కపూర్‌పై మరో పిడుగు...యెస్ బ్యాంక్ కొత్త సీఈఓగా ప్రశాంత్...

"అమెరికన్లకు జాక్ మా చేసే విరాళం  కరోనా వైరస్ వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము!" అని జాక్ మా ఫౌండేషన్ పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో ఆయన చెప్పారు.

కరోనా వైరస్ బారిన పడిన జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్ వంటి దేశాలకు గత కొన్ని  వారాలుగా మా సంస్థలు వాటిని సరఫరా చేయడంలో సహాయపడ్డాయని చైనా అత్యంత ధనవంతుడైన జాక్ మా అన్నారు.

also read ఆ కారణంతోనే మైక్రోసాఫ్ట్‌ నుంచి తప్పుకున్న: బిల్ గేట్స్

కరోనా  వైరస్ పరీక్షలు నిర్వహించడం మందగించడంపై అమెరికా ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ తీవ్రతపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రజారోగ్య అధికారులు మందలించారు.

నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ట్రంప్‌ను ఎదుర్కొనే రేసులో డెమొక్రాటిక్ ఫ్రంట్‌ రన్నర్ జో బిడెన్ గురువారం కరోనా వైరస్ టెస్ట్ కిట్లు లేకపోవడాన్ని నిందించారు.
 

click me!