అక్షయ తృతీయ స్పెషల్: బంగారం కొనడానికి మంచి టైం ఎప్పుడు తెలుసా?

By Ashok kumar Sandra  |  First Published May 10, 2024, 12:26 PM IST

భూమిపై లభించే విలువైన లోహాలలో బంగారం ఒకటి. బంగారం శుభాన్ని, మంచిని సూచిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో, బంగారంకి అనేక గ్రహాలతో సంబంధం ఉంటుంది.  


ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి నాడు అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 10వ తేదీ శుక్రవారం అంటే నేడు  జరుపుకుంటారు. అక్షయ తృతీయ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. అక్షయ తృతీయ రోజున ఏ శుభ కార్యమైనా నెరవేరుతుంది. ఈ రోజు  లక్ష్మి దేవిని పూజించడానికి, కొత్త వస్తువులను కొనడానికి కూడా ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు కొనుగోలు చేసిన వస్తువుల ఫలాలు శాశ్వతంగా ఉంటాయని చెబుతారు. ముఖ్యంగా ఈ రోజు బంగారం కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు బంగారంతో చేసిన వస్తువులకు ఎందుకు అంత ప్రాధాన్యత ఉందో తెలుసుకుందాం... 

జ్యోతిష్య శాస్త్రంలో బంగారం ప్రాముఖ్యత: భూమిపై లభించే విలువైన లోహాలలో బంగారం ఒకటి. బంగారం శుభాన్ని, మంచిని సూచిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో, బంగారంకి అనేక గ్రహాలతో సంబంధం ఉంటుంది.  కానీ బంగారం లాభదాయకంగా ఉంటే అది వారిని  ధనవంతులని చేస్తుంది. అందుకే, అక్షయ తృతీయ రోజున ప్రజలు బంగారు ఆభరణాలు లేదా బంగారంతో చేసిన వస్తువులను ఇంటికి తీసుకువస్తుంటారు.

Latest Videos

 అక్షయ తృతీయ రోజున బంగారం ఎలా కొనాలి?
అక్షయ తృతీయ రోజున బంగారం కొనడానికి మంచి సమయం మధ్యాహ్నం. ఈ రోజు బంగారం కొనలేకపోతే బంగారం పూతతో చేసిన  వస్తువులను కొనవచ్చు  అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే, దానం చేయడానికి ఖచ్చితంగా కొంత లోహాలని కొనుగోలు చేయవచ్చు. 

బంగారం కొనడానికి మంచి సమయం:
ఈ సంవత్సరం అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి నాలుగు శుభ ముహూర్తాలు ఉండబోతున్నాయి. మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏ శుభ సమయంలోనైనా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

మొదటి ముహూర్తం - ఉదయం 5.33 నుండి 10.37 వరకు
రెండవ ముహూర్తం - మధ్యాహ్నం 12.18 నుండి మధ్యాహ్నం 1.59 వరకు
మూడవ ముహూర్తం - సాయంత్రం 5.21 నుండి 7.02 వరకు
నాల్గవ ముహూర్తం - రాత్రి 9.40 నుండి 10.59 వరకు

click me!