
భారత్, ఫ్రాన్స్ మధ్య జరుగుతున్న వ్యాపార బంధంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం అయ్యింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నటు వంటి ఎయిర్ ఇండియా, ఎయిర్ బస్ మధ్య ఒప్పందానికి నేడు పునాది పడింది. టాటాల ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా, ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్ నుంచి సుమారు 250 విమానాలను కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇరుదేశాల మధ్య జరుగుతున్న ఈ వ్యాపార ఒప్పందానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే ఫ్రాన్స్ అద్యక్షుడు ఇమాన్యుల్ మాక్రోన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా సైతం హాజరు కావడం విశేషం.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్త ఎయిర్ ఇండియా-ఎయిర్‌బస్ విమానాల కొనుగోలు భాగస్వామ్య ఒప్పందం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరవడం విశేషం. ఈ సందర్భంగా టాటా సన్స్ ఛైర్మన్ మాట్లాడుతూ ఎయిర్‌బస్‌తో ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరచుకున్నామని చెప్పారు. ఎయిర్‌బస్ నుండి 250 విమానాలను కొనుగోలు చేయడానికి మేము ఒప్పందంపై సంతకం చేశామని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను అని రతన్ టాటా తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ మైలురాయి ఒప్పందానికి ఎయిర్ ఇండియా-ఎయిర్‌బస్‌ను నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగం అయినందుకు నా స్నేహితుడు ఇమ్మాన్యుయేల్ నేను మాక్రాన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ ముఖ్యమైన ఒప్పందం భారతదేశం, ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాలను అలాగే భారతదేశ పౌర విమానయాన రంగంలో సరికొత్త విజయాలను నమోదు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ఒఫ్పందం అనంతరం దేశంలోని మారుమూల ప్రాంతాలు కూడా ఎయిర్ కనెక్టివిటీతో అనుసంధానం అవుతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడుతోంది. మేక్ ఇన్ ఇండియా - మేక్ ఫర్ ది వరల్డ్ విజన్ కింద ఏరోస్పేస్ తయారీలో అనేక కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయని ప్రధాని మోదీ తెలిపారు.
భారత్-ఫ్రెంచ్ భాగస్వామ్యం ప్రపంచ వాణిజ్యంలో ఈ ఒప్పందం ఒక మైలురాయి అవుతుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం వల్ల ఆసియాలో శాంతి పరిఢవిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత , స్థిరత్వానికి సంబంధించిన సమస్యలతో పాటు, ప్రపంచ ఆహార భద్రత , ఆరోగ్య వ్యవస్థ ఇలా అనేక రంగాల్లో భారత్, ఫ్రాన్స్ కలిసి సానుకూల సహకారాన్ని అందించుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.