ఉల్లి తరువాత, ఇప్పుడు వంట నూనె ధరలకు రెక్కలు...

By Sandra Ashok KumarFirst Published Dec 22, 2019, 3:20 PM IST
Highlights

పామాయిల్ ధరలు గత రెండు నెలల్లో లీటరుకు రూ .20 (35 శాతానికి పైగా) పెరిగాయి. పామాయిల్ ఇతర వంటే నూనెల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.పామాయిల్ ధరలు గత రెండు నెలల్లో లీటరుకు రూ .20 (35 శాతానికి పైగా) పెరిగాయి. పామాయిల్ తో పాటు ఇతర నూనెల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.

న్యూ ఢిల్లీ: ఉల్లి, వెల్లుల్లి తరువాత ఇపుడు వంట నూనె ధరలు పెరిగాయి. దిగుమతుల ఖర్చు ఎక్కువ కారణంగా  నూనె ధరలు గణనీయంగా పెరిగాయి. ఇతర వంట నూనె ధరలు  కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నందున వినియోగదారులపై ఈ భారం మరింత ప్రభావం చూపనున్నది అని  చమురు పరిశ్రమ నిపుణులు అంటున్నారు.

పామాయిల్ ధరలు గత రెండు నెలల్లో లీటరుకు రూ .20 (35 శాతానికి పైగా) పెరిగాయి. పామాయిల్ తో పాటు ఇతర నూనెల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.మలేషియా, ఇండోనేషియా నుండి  దిగుమతుల ఖర్చు ఎక్కువ అవడం కారణంగా, వంట నూనె ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది ”అని చమురు-నూనెగింజల మార్కెట్ నిపుణుడు సలీల్ జైన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

also read కంపెనీ డైరెక్టర్‌ను చంపేస్తానని బెదిరించిన నీరవ్ మోడీ...కారణం ?

మరో చమురు పరిశ్రమ నిపుణుడు మాట్లాడుతూ "దేశంలో వంటే నూనెలలో స్వయం సమృద్ధి సాధించాలనుకుంటే రైతుల పంటలకు మంచి ధరలను అందించాలీ" ఆని సూచించారు.అంతర్జాతీయ మార్కెట్ నుండి  దిగుమతుల ఖర్చు ఎక్కువ కారణంగా భారతదేశంలో వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ రైతులు ఇప్పుడు ఆయిల్ సీడ్స్ ద్వారా అధిక ధరను పొందుతున్నారు.

దీనివల్ల రైతులు నూనె గింజలను పండించడానికి ప్రోత్సహిస్తుంది ”అని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వి.మెహతా అన్నారు.భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్ దిగుమతిదారి. అయితే భారీ వర్షాలు సోయాబీన్ పంటలను దెబ్బతీసినందున ఈ సంవత్సరం రబీ సీజన్ లో నూనె గింజల సాగు తక్కువగా ఉన్నందున ఎడిబుల్ ఆయిల్ దిగుమతులపై దేశం ఆధారపడటం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.


అంతేకాకుండా అర్జెంటీనా  దేశం సోయా నూనెపై ఎగుమతి సుంకం పెరగడం భారతదేశంలో సోయా ఆయిల్ దిగుమతుల ధరను కూడా పెంచుతుంది దీనివల్ల  వంట నూనె ధరలను మరింత పెంచడానికి దారితీస్తుంది.అర్జెంటీనా దేశం సోయా నూనెపై ఎగుమతి సుంకాన్ని 25 శాతం నుంచి 30 శాతానికి పెంచింది.

మరోవైపు మలేషియాలో వచ్చే ఏడాది బి -20 బయో డీజిల్ ప్రోగ్రాం, ఇండోనేషియాలో బి -30 బయో డీజిల్ ప్రోగ్రాం ప్రవేశపెట్టిన తరువాత ఇరు దేశాలలో పామాయిల్ వినియోగం పెరుగనుంది.సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ డేటా ప్రకారం ఈ ఏడాది నవంబర్‌లో దేశానికి కూరగాయల నూనె (ఎడిబుల్ ఆయిల్ అండ్ నాన్ ఎడిబుల్ ఆయిల్ )  దిగుమతి 11,27,220 టన్నులు కాగా, కిందటి ఏడాది క్రితం ఇదే నెలలో 11,33,893 టన్నులు.

also read కార్పొరేట్లకు తక్కువ వడ్డీ రుణాలతో రిస్క్‌... ఎస్బీఐ చైర్మన్

కండ్లా పోర్టులో సిపిఓ (ముడి పామాయిల్) ధర శుక్రవారం టన్నుకు 757 డాలర్లు (సిఐఎఫ్) కాగా, మలేషియా నుంచి దిగుమతి చేసుకున్న ఆర్‌బిడి పామోలిన్ టన్నుకు 782 డాలర్లు, సోయా ధర టన్నుకు 878 డాలర్లు, సున్ ఫ్లవర్ ముడి టన్నుకు 847 డాలర్లు.కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ గత వారం విడుదల చేసిన విత్తనాల గణాంకాల ప్రకారం, ఈ ఏడాది నూనెగింజల పంటల విస్తీర్ణం 68.24 లక్షల హెక్టార్లలో ఉంది, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 2.47 లక్షల హెక్టార్లలో తక్కువ.


గత ఖరీఫ్ సీజన్లో  నూనెగింజల పంట అయిన సోయాబీన్ ఉత్పత్తి గత సంవత్సరంతో పోలిస్తే దేశంలో 18 శాతం తగ్గుతుందని అంచనా.సోయాబీన్ ప్రాసెసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సోపా) అంచనాల ప్రకారం, ఈ సంవత్సరం దేశంలో సోయాబీన్ ఉత్పత్తి 89.94 లక్షల టన్నులు, ఇది అంతకుముందు సంవత్సరం 109.33 లక్షల టన్నుల ఉత్పత్తి కంటే 71.73 శాతం తక్కువ.

click me!