Safe Cars: ధర తక్కువ.. సేఫ్టీ ఎక్కువ, రూ.6 లక్షల కంటే తక్కువకే 6 ఎయిర్ బ్యాగ్స్‌తో రెండు కార్లు

Published : Mar 04, 2025, 09:15 AM IST
Safe Cars: ధర తక్కువ.. సేఫ్టీ ఎక్కువ, రూ.6 లక్షల కంటే తక్కువకే 6 ఎయిర్ బ్యాగ్స్‌తో రెండు కార్లు

సారాంశం

Safe Cars: కారు కొనాలంటే లగ్జరీ ఫీచర్లతో పాటు సేఫ్టీ కూడా చాలా ముఖ్యం కదా.. మారుతి సుజుకి ఈ రెండింటికీ ప్రాధాన్యమిస్తూ రెండు కార్లను అప్‌గ్రేట్ చేసి మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీంతో దేశంలో తక్కువ ధరలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగిన బెస్ట్ అండ్ సేఫ్టీ కార్లుగా ఇవి నిలిచాయి. ఆ కార్లు, వాటి ఫీచర్లు తెలుసుకుందాం రండి.

దేశంలోనే అతిపెద్ద కార్ల అమ్మకాల కంపెనీ మారుతి సుజుకి తన కార్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. అందులో భాగంగానే ఈ కంపెనీ తన తక్కువ ధర కారుగా గుర్తింపు పొందిన ఆల్టో K10లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేసి మార్కెట్ లోకి విడుదల చేసింది. దీంతో పాటు మారుతి సెలెరియోలో కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను చేర్చింది. దీంతో మారుతి సుజుకి ఆల్టో K10, సెలెరియో రెండూ స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న దేశంలోనే చాలా తక్కువ ధర కార్లుగా మారాయి. ఈ రెండు కార్ల ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం. 

మారుతి ఆల్టో K10 ధర

అప్‌డేట్ అయిన మారుతి సుజుకి ఆల్టో K10లో సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు కల్పించారు. అయితే ఇప్పుడున్న 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కార్ పవర్‌ట్రెయిన్‌లో ఉంచారు. ఈ మార్పుల తర్వాత ఇండియన్ మార్కెట్‌లో ఆల్టో K10 ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.4.23 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఇందులో టాప్ మోడల్‌కు రూ.6.21 లక్షల వరకు ఉంది.

ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో, రియర్ పార్కింగ్ సెన్సార్, వెనుక సీటులో కూర్చునే ప్రయాణికులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, లగేజీ కోసం క్రాస్‌బార్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(EBD), లగేజీ రిటెన్షన్ క్రాస్‌బార్లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లను కూడా కంపెనీ ఈ కారులో చేర్చింది. ఇంత తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లు కారు ఇదే కావడం విశేషం.

మారుతి సెలెరియో ధర

మారుతి సుజుకి సెలెరియోలోని అన్ని వేరియంట్లలో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. అయితే సెలెరియో పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడున్న 1.0 లీటర్ పెట్రోల్ ఇంజినే సెలెరియోలో కూడా ఉంది. అయితే ఈ అప్‌డేట్ తర్వాత మారుతి సెలెరియో ధర పెరిగింది.

ఇండియాలో బాగా అమ్ముడవుతున్న చిన్న హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి సెలెరియో కూడా ఒకటి. డిజైన్ మార్పులు, ఫీచర్ అప్‌డేట్‌లతో సహా 2021లోనే దీనికి పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఇప్పుడు స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వచ్చినా డిజైన్, ఇతర ఫీచర్లలో మార్పులు ఏమీ చేయడం లేదు. స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటం వల్ల దీని సేఫ్టీ బాగా పెరిగింది.

ఇండియాలో సేఫ్టీ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ అప్‌గ్రేడ్ ఒక ముఖ్యమైన మార్పని చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌లో మారుతి సెలెరియో కొత్త ఎక్స్ షోరూమ్ ధర రూ.5.64 లక్షల నుంచి టాప్ మోడల్‌కు రూ.7.37 లక్షల వరకు ఉంది. 

ఇది కూడా చదవండి: నెలకు రూ.4999 కడితే చాలు! ఈ బుల్లి కారులో హాయిగా తిరగొచ్చు

PREV
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?