అదానీ ఈజ్ బ్యాక్, షేర్లు పుంజుకోవడంతో రెండు రోజుల్లో అమాంతంగా పెరిగిన సంపద, కారణం ఇదే..

Published : Mar 01, 2023, 12:52 PM IST
అదానీ ఈజ్ బ్యాక్,  షేర్లు పుంజుకోవడంతో రెండు రోజుల్లో అమాంతంగా పెరిగిన సంపద, కారణం ఇదే..

సారాంశం

నేటి ట్రేడింగ్ లో అదానీ గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్ షేర్లలో భారీగా కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. గ్రూపులోని అన్ని షేర్లు దాదాపు 15 శాతం వరకు లాభపడ్డాయి. దీంతో మదుపరుల్లో జోష్ నింపింది.

హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత భారీ క్షీణతను ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ షేర్లు ఈ వారం వరుసగా రెండో రోజు కూడా పుంజుకున్నాయి. నేటి ట్రేడింగ్ లో అదానీ గ్రూపులోని 10 స్టాక్‌లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. దాదాపు 15 శాతం వరకు లాభపడ్డాయి. మంగళవారం కూడా 10 షేర్లలో 8 లాభాలతో ముగిశాయి. ఈ బూమ్ నేపథ్యంలో సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ ర్యాంకింగ్ మెరుగుపడింది. అయితే అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా ఎందుకు లాభపడుతున్నాయో తెలుసుకోండి. 

షేర్ల పెరుగుదల వెనుక ఇదే కారణం
ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపేందుకు అదానీ గ్రూప్ రుణాలను తిరిగి చెల్లించేందుకు ప్రయత్నిస్తోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాయిటర్స్ ప్రకారం, గ్రూప్ మార్చి చివరి నాటికి 690 మిలియన్ డాలర్ల నుండి 790 మిలియన్ డాలర్ల షేర్-బ్యాక్డ్ రుణాలను తిరిగి చెల్లించాలని చూస్తోంది. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచేందుకు అదానీ గ్రూప్ ఈ వారం సింగపూర్, హాంకాంగ్‌లలో  రోడ్‌షోలను నిర్వహిస్తోంది. ఒక నివేదిక ప్రకారం, అదానీ గ్రూప్ 800 మిలియన్ డాలర్ల రుణ పొందేందుకు కమిట్ మెంట్ లభించినట్లు వార్తలు వస్తున్నాయి.

అదానీ గ్రూప్ స్టాక్స్ 15 శాతం పెరిగాయి.
అదానీ ట్రాన్స్‌మిషన్ స్టాక్ ఈరోజు 5 శాతం లాభపడింది. ప్రస్తుతం  ధర రూ.675 వద్ద ఉంది. అదానీ టోటల్ గ్యాస్ స్టాక్ కూడా ఈరోజు 5 శాతం లాభపడి రూ.712కి చేరుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు కూడా ఈరోజు 5 శాతం లాభపడి రూ.510కి చేరింది. అదానీ పవర్ 5 శాతం పెరిగి రూ.154కి చేరుకుంది.

అదానీ పోర్ట్స్ 4 శాతం పెరిగి రూ.616కు చేరుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ నేడు 15 శాతం లాభపడి రూ.1568కి చేరుకుంది. కాగా అదానీ విల్మార్ నేడు 5 శాతం లాభపడి రూ.380కి చేరుకుంది. ఈ రోజు NDTV, ACC, అంబుజా సిమెంట్స్‌లో కూడా కొనుగోలు కనిపిస్తుంది.

గౌతమ్ అదానీ సంపదలో పెరుగుదల
గత 24 గంటల్లో అదానీ గ్రూప్ షేర్ల పెరుగుదల నేపథ్యంలో, గౌతమ్ అదానీ సంపద రూ. 17500 కోట్లు పెరిగి 3990 కోట్ల డాలర్లకు చేరుకుంది. దీంతో సంపన్నుల జాబితాలో అతని ర్యాంకు 2 స్థానాలు ఎగబాకి 30కి చేరుకున్నాడు..ఈ సంవత్సరం ఇప్పటివరకు, అదానీ సంపద 8060 మిలియన్ డాలర్లు తగ్గింది. గతేడాది సెప్టెంబరులో ఆయన సంపద 15000 మిలియన్ డాలర్లకు పైగా ఉంది.

మంగళవారం అదానీ గ్రూప్‌నకు చెందిన 10 షేర్లలో 8 లాభాలతో ముగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 14.22 శాతం బలమైన లాభంతో రూ.1,364.05 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో ఇది 19 శాతం వరకు పెరిగింది. అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ పవర్, ఎన్డీటీవీ, అంబుజా సిమెంట్స్ కూడా ఊపందుకున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Electric Scooter: లక్ష మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. ఓలాకు చుక్కలు చూపించింది
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !