
భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నేటి పెట్రోల్, డీజిల్ తాజా ధరలను బుధవారం (1 మార్చి 2023) ప్రకటించాయి. దీంతో ఈ రోజు ఇంధన ధరలలో ఎటువంటి మార్పు లేదు. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నప్పటి అనేక నగరాల్లో పెట్రోల్ ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర లీటర్ రూ.89.62. కాగా, ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.
బెంగళూరు: పెట్రోలు ధర లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89
లక్నో: పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76
నోయిడా: పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.79, డీజిల్ ధర: రూ. 89.96
గురుగ్రామ్: పెట్రోల్ ధర లీటరుకు రూ. 97.18, డీజిల్ ధర రూ. 90.05
చండీగఢ్: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.20, డీజిల్ ధర రూ. 84.26
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర కొన్ని నెలలుగా లీటరుకు రూ.109.66 వద్ద కొనసాగుతోంది. డీజిల్ లీటర్ ధర రూ.97.82 వద్ద కొనసాగుతోంది.
చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న దాఖలాలు కనిపిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 1.65 డాలర్లు పెరిగి $84.10 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర కూడా 2.11 డాలర్లు పెరిగి $77.79 డాలర్ల వద్ద ఉంది.
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లు ప్రకటిస్తారు. పెట్రోలు, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది.