మారుతి 'మ్యాజికల్ కార్'.. కొనేందుకు జనాలు క్యూ.. మైలేజ్ 34 కి.మీ, ధర కూడా తక్కువే..

By Ashok kumar Sandra  |  First Published Mar 22, 2024, 2:11 AM IST

మారుతి వ్యాగన్ఆర్  ఎక్స్-షోరూమ్ ధర ప్రారంభ  టాప్ మోడల్ కోసం రూ. 5.54 లక్షల నుండి రూ. 7.38 లక్షల మధ్య ఉంది. వ్యాగన్ R CNG వేరియంట్  మైలేజ్ చూస్తే 34.5 kmpl.
 


భారతీయ వినియోగదారులలో హ్యాచ్‌బ్యాక్ కార్లకు డిమాండ్ భారీగా ఉంది . మారుతి సుజుకి గత కొన్నేళ్లుగా హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో నిలకడగా ముందుంటోంది. గత నెలలో మరోసారి ఫిబ్రవరి 2024లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అమ్మకాలలో హ్యాచ్‌బ్యాక్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కాలంలో మారుతి వ్యాగన్ఆర్ మొత్తం 19,412 యూనిట్ల కార్లను విక్రయించింది. సరిగ్గా ఏడాది క్రితం ఫిబ్రవరి 2023లో మారుతీ వ్యాగన్ఆర్ 16,889 యూనిట్లను విక్రయించింది. ఈ కాలంలో మారుతి వ్యాగన్ఆర్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 14.94 శాతం పెరిగాయి. మారుతి వ్యాగన్ఆర్   ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర టాప్ మోడల్  రూ. 5.54 లక్షల నుండి రూ. 7.38 లక్షల మధ్య ఉంది. వ్యాగన్ R CNG వేరియంట్  మైలేజ్ 34.05 kmpl.

మారుతీ బాలెనో 17,517 యూనిట్ల విక్రయాలతో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో రెండో స్థానంలో ఉంది. ఫిబ్రవరి 2023లో, మారుతి బాలెనో మొత్తం 18,593 యూనిట్ల కార్లను విక్రయించింది. మారుతీ స్విఫ్ట్ 13,165 యూనిట్ల విక్రయాలతో ఈ లిస్టులో మూడో స్థానంలో ఉంది. ఫిబ్రవరి 2023లో మారుతి స్విఫ్ట్ మొత్తం 18,412 యూనిట్ల కార్లను విక్రయించింది. ఈ లిస్టులో చూస్తే  మారుతి ఆల్టో 11,723 యూనిట్ల విక్రయాలతో నాలుగో స్థానంలో ఉంది.  ఫిబ్రవరి 2023లో  మారుతి ఆల్టో 18,114 యూనిట్ల కార్లను విక్రయించింది.

Latest Videos

ఈ జాబితాలో టాటా టియాగో 6,947 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో ఉంది. టాటా టియాగో ఫిబ్రవరి 2023లో మొత్తం 7,457 యూనిట్ల కార్లను విక్రయించింది. టియాగో   ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా ఈ సేల్‌లో చేర్చబడింది. హ్యుందాయ్ ఐ20 ఈ హ్యాచ్‌బ్యాక్ కార్ల విక్రయాల జాబితాలో 5,131 యూనిట్ల విక్రయాలతో ఆరవ స్థానంలో ఉంది.  హ్యుందాయ్ i20 ఫిబ్రవరి 2023లో మొత్తం 9,287 యూనిట్లను విక్రయించింది.

4,947 యూనిట్ల అమ్మకాలతో హ్యుందాయ్ ఐ10 నియోస్ ఈ కార్ల విక్రయాల జాబితాలో ఏడవ స్థానంలో ఉంది. టయోటా గ్లాంజా 4,581 యూనిట్లను విక్రయించింది అండ్  ఈ  లిస్టులో  ఎనిమిదో స్థానంలో ఉంది.  టాటా ఆల్ట్రోజ్ గత నెలలో 4,568 యూనిట్ల అమ్మకాలతో  తొమ్మిదవ స్థానంలో ఉంది. కాగా, మారుతీ సెలెరియో 3,566 యూనిట్ల విక్రయాలతో 10వ స్థానంలో ఉంది.

click me!