రోడ్డున పడనున్న 2 వేల మంది ఉద్యోగులు...కారణం...?

By Sandra Ashok KumarFirst Published Dec 20, 2019, 12:49 PM IST
Highlights

ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాల్లో కోత  పెట్టనుంది. ఓ పత్రిక  కథనం ప్రకారం జనవరి చివరినాటికి 2 వేల మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది.ముఖ్యంగా అమ్మకాలు, సరఫరా, ఆపరేషన్స్‌ విభాగాల్లో ఉద్యోగులను తగ్గించుకునేందుకు కొత్త  ప్రణాళికలను చూస్తుంది.

ముంబై:  భారతదేశంలో అతిపెద్ద హోటల్‌ బ్రాండ్‌ ఓయో దేశంలో కనీసం 2 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాల్లో కోత  పెట్టనుంది. ఓ పత్రిక  కథనం ప్రకారం జనవరి చివరినాటికి 2 వేల మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది. ముఖ్యంగా అమ్మకాలు, సరఫరా, ఆపరేషన్స్‌ విభాగాల్లో ఉద్యోగులను తగ్గించుకునేందుకు కొత్త  ప్రణాళికలను చూస్తుంది.

also read టాటాలకు గట్టి ఎదురు దెబ్బ... మిస్త్రీ అడుగు పెట్టడం కష్టమే?

రితేష్ అగర్వాల్ నేతృత్వంలోని హాస్పిటాలిటీ  సంస్థ ఓయో  ప్రతి నెలాలో ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తుంది. ఫలితాలు, గ్రేడ్స్‌ ఆధారంగా కొంతమంది పనితీరులో మెరుగుదలకు సంబంధించిన శిక్షణా కార్యక్రమానికి పంపడం లేదా తొలగించడం లాంటివి చేస్తుంది.

అయితే సంస్థ పునరుద్ధరణలో భాగంగా సంతృప్తికరమైన గ్రేడ్స్‌ వచ్చిన ఉద్యోగులను కూడా తీసివేసేందుకు కంపెనీ ప్లాన్‌ చేస్తోందన్న అంచనాలు కూడా  నెలకొన్నాయి. సాధారణంగా ‘డి’ రేటింగ్ వచ్చిన ఉద్యోగులపై వేటు వేసే కంపెనీ, బీ అంతకంటే మెరుగైన రేటింగ్ ఉన్న ఉద్యోగులకు కూడా తిసివేసేందుకు చూస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఉద్యోగుల సగటు జీతాలు రూ. 10 నుంచి 12 లక్షల పరిధిలో ఉంటాయని కొందరు భావిస్తున్నారు. 

also read హైదరాబాద్‌లో ఆకర్షణీయ జీతాలు...టెక్కీలదే హవా

 మార్చి 2019లో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఓయో హోటల్స్ అండ్‌ హోమ్స్ మొత్తం నష్టం రూ.2,384 కోట్లకు చేరింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆరు రెట్లు ఎక్కువ. నిర్వహణ వ్యయాలు, ఉద్యోగుల సంబంధిత ఖర్చులు పెరగడం వల్ల నష్టం పెరిగిందని కంపనీ అంచనా వేస్తుంది. ఖర్చులు వార్షిక ప్రాతిపదికన ఆరు రెట్లు పెరిగి రూ.1,539 కోట్లకు చేరుకోగా, నిర్వహణ ఖర్చులు ఐదు రెట్లు పెరిగి 6,131 కోట్లకు చేరుకుంది.

click me!