
న్యూఢిల్లీ: చారిత్రకంగా వార్షిక బడ్జెట్లు రెండు రకాలుగా ఉంటాయి. విభిన్న పరిస్థితులు, సవాళ్ల మధ్య ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌కు సమర్పిస్తుంటారు.1998-1999లో అప్పటి అటల్ బిహారీ వాజపేయి క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా. బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించడానికి కొద్ది కాలం ముందే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్.. పోఖ్రాన్‌లో అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించింది.
also read ఈరోజు నుంచి 3 రోజుల పాటు బ్యాంకులు బంద్...
అంతర్జాతీయంగా అమెరికా సహా పలు దేశాల నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్న తరుణం.. ఈ తరుణంలో యశ్వంత్ సిన్హా అంతర్జాతీయ ఆంక్షలను అధిగమిస్తూ, గృహ, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
1998-99లో హౌసింగ్ రంగానికి భారీ ఉపశమనం లభించింది. ఇళ్ల విక్రయంలో టాక్సబుల్ ఇన్‌కం నుంచి లాభాలపై పూర్తిగా పన్ను మినహాయించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆమోదం పొందిన ఇళ్ల ప్రాజెక్టులకు మరో ఐదేళ్ల పాటు పన్ను చెల్లింపులో 30 శాతం రాయితీ కల్పించారు.
మౌలిక వసతుల ప్రాజెక్టులకు యశ్వంత్ సిన్హా పన్ను రాయితీలు కల్పించారు. వెనుకబడిన రాష్ట్రాలు, జిల్లాల్లో పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేసిన సంస్థలకు టాక్స్ హాలీడే ప్రకటించారు. ఆయిల్ (ముడి చమురు శుద్ధి) రిఫైనింగ్ మీద టాక్స్ హాలీడే ప్రకటించారు.
also read ఆ కారణాల వల్లె రాజీనామా చేశాను :విప్రో సిఈఓ
దేశీయ ఉత్పాదక రంగంలో 40 శాతం వాటా కలిగి ఉన్న ‘రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల పెట్టుబడులు గల చిన్న తరహా పరిశ్రమల`కు ఎక్సైజ్ డ్యూటీ నుంచి మినహాయింపు పెంచారు. వ్యవసాయ రంగానికి ప్రణాళికారంగ కేటాయింపులు 58 శాతానికి పెంచుతూ యశ్వంత్ సిన్హా నిర్ణయం తీసుకున్నారు. రైతులకు క్రెడిట్ కార్డులు జారీ చేయడంతోపాటు నాబార్డ్‌లో షేర్ క్యాపిటల్ పెంచారు.
అత్యధిక విలువ గల విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలకు 90 రోజుల్లో క్లియరెన్స్ ఇచ్చేవారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 26 శాతం వాటాల ఉపసంహరణకు నేరుగా అనుమతినిస్తూ యశ్వంత్ సిన్హా నిర్ణయం తీసుకున్నారు.