విదేశాల్లో నల్ల డబ్బు... ఇండియన్స్ కి స్విట్జర్లాండ్ షాక్

By telugu teamFirst Published May 27, 2019, 11:36 AM IST
Highlights

విదేశాల్లో  నల్ల డబ్బు దాచుకుంటున్న కొందరు భారతీయులకు ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. విదేశాల్లో దాచిన నల్ల డబ్బు స్వదేశానికి రప్పిస్తానని మోదీ ప్రభుత్వం గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. 


విదేశాల్లో  నల్ల డబ్బు దాచుకుంటున్న కొందరు భారతీయులకు ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. విదేశాల్లో దాచిన నల్ల డబ్బు స్వదేశానికి రప్పిస్తానని మోదీ ప్రభుత్వం గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. కాగా... ఈ విషయంలో భారత ప్రభుత్వానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం సహకరించేందుకు ముందుకు వచ్చింది.

ఈ క్రమంలోనే తమ దేశంలోని వివిధ బ్యాంకుల్లో రహస్య ఖాతాలు కలిగిన 11 మంది భారతీయులకు ఈనెల 21న నోటీసులు జారీ చేసింది. భారత ప్రభుత్వంతో వారి వివరాలను పంచుకోవటానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా కోరుతూ 11మంది ఇండియన్స్ కి నోటీసులు జారీ చేసింది.

అయితే... మొత్తం జాబితాలో 11మంది ఇండియన్స్ ఉండగా... వారిలో ఇద్దరి వివరాలను మాత్రమే పూర్తిగా బయటకు తెలియజేశారు. వారు కృష్ణభగవాన్‌ రామ్‌చంద్‌(పుట్టిన తేదీ 1949 మే), కల్పేశ్‌ హర్షద్‌ కినరివాలా(పుట్టిన తేదీ 1972 సెప్టెంబరు). అంతకు మించి వివరాలను ఏ ఇతర వివరాలను ఆ అధికారిక ప్రకటనలో వెల్లడించలేదు. 

మిగిలిన వారి పేర్లు  షార్ట్ కట్స్ లో ఉన్నాయి  ఎస్‌.బి.కె (పుట్టిన తేదీ 1944, నవంబరు 24), ఎ.బి.కె.ఐ(పుట్టిన తేదీ 1944, జులై 9), పి.ఎ.ఎస్‌(పుట్టిన తేదీ 1983, నవంబరు 2), ఆర్‌.ఎ.ఎస్‌ (పుట్టిన తేదీ 1973 నవంబరు 22), ఎ.పి.ఎస్‌. (పుట్టిన తేదీ 1944 నవంబరు 27), ఎ.డి.ఎస్‌ (పుట్టిన తేదీ 1949, ఆగస్టు 14),  ఎం.ఎల్‌.ఎ (పుట్టిన తేదీ 1935 మే 20), ఎన్‌.ఎం.ఎ (1968 ఫిబ్రవరి 21),  ఎం.ఎం.ఎ (1973 జూన్‌ 27). వెల్లడించిన ఖాతాదారుల్లో పురుషులు, మహిళలు ఉన్నారు. ఈ జాబితాలో పేర్కొన్న వ్యక్తులు లేదా వారి ప్రతినిధులు 30 రోజుల్లోగా సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో సంప్రదించాలని, భారత ప్రభుత్వానికి తమ పేర్లను, ఆర్థిక వివరాలను ఎందుకు వెల్లడించరాదో తెలపాలని తాఖీదుల్లో  స్విట్జర్లాండ్‌ ప్రభుత్వ పన్నుల విభాగం పేర్కొంది.

click me!