వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ పూర్తిగా పేపర్ లెస్‌గా ఉండనుంది. దీనితో బడ్జెట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరికొత్త మొబైల్ యాప్‌ను (Union Budget mobile APP) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ యాప్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ పూర్తిగా పేపర్ లెస్‌గా ఉండనుంది. దీనితో బడ్జెట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరికొత్త మొబైల్ యాప్‌ను (Union Budget mobile APP) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ యాప్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి స్థాయిలో పేపర్‌లెస్ బడ్జెట్
undefined
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ (Budget 2022-23 date) ప్రవేశపెట్టనున్నారు. పూర్తి స్థాయిలో పేపర్‌లెస్‌గా బడ్జెట్ ప్రవేశపెడుతుండటం ఇది రెండో సారి. గత ఏడాది కూడా సాఫ్ట్ కాపీ రూపంలోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి. కరోనా సంక్షోభం ఇందుకు (Corona impact on Budget) కారణం. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులు (ఎంపీలు), సాధారణ పౌరులు బడ్జెట్ వివరాలను సులంభంగా చదివేందుకు వీలుగా కేంద్రం 'యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్'ను (Union Budget App) ప్రారంభించింది.
ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి..?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. ఈ మొబైల్ యాప్‌లో బడ్జెట్‌కు సంబంధించిన వివరాలన్నింటిని తెలుసుకోవచ్చు. ఇప్పటికే ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో ఈ యాప్ డౌన్లోడ్లకు అందుబాటులో ఉంది. ఈ మొబైల్ యాప్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ సందర్భంగా ఈ యాప్‌ను ఎక్కువ మంది వినియోగించే వీలుంది. ఇదే అదనుగా క్లోన్ యాప్‌లు పుట్టుకొచ్చే ప్రమాదముంది. కాబట్టి ఈ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే ముందు.. యాప్ పబ్లీషర్ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐఎఫ్) పేరును చూడాలని ప్రభుత్వం సూచించింది.
ప్లే స్టోర్, యాప్ స్టోర్‌తో పాటు.. యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ నుంచి కూడా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే వీలుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. వెబ్ పోర్టల్, యాప్ ద్వారా బడ్జెట్ డాక్యుమెంట్లను చదవడం, డౌన్లోడ్ చేసుకోవడం కూడా చేయొచ్చని వివరించింది.
ఈ యాప్‌లో ఏఏ వివరాలు ఉంటాయి..?
ఈ యాప్‌లో బడ్జెట్ స్పీచ్, యూన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ( బడ్జెట్), డిమాండ్ ఫర్ గ్రాంట్స్ (డీజీ), ఫినాన్స్ బిల్ సహా మొత్తం 14 రకాల డాక్యుమెంట్లు అందుబాటులో ఉంటాయి. అన్ని డాక్యుమెంట్లు పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెర్చ్ ఆప్షన్ కూడా (Budget APP features) ఉంటుంది.
హల్వా వేడుకలోనూ మార్పులు
బడ్జెట్ సంప్రదాయంలో మరో కీలక మార్పు చేసింది ప్రభుత్వం. బడ్జెట్ పత్రాల ముద్రనకు ముందు నిర్వహించే హల్వా వేడుక (Halwa ceremony) బదులు.. మిఠాయి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బడ్జెట్ ప్రతుల ముద్రననకు ముందు (బడ్జెట్ రూపకల్పన చివరి దశ) ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వేడుక తర్వాత.. బడ్జెట్ ప్రతుల ముద్రనలో పాల్గొనే ఎవరు కూడా.. ప్రెస్ నుంచి బయటకు వెళ్లేందుకు వీలుందడు. ఫోన్ కూడా వాడకూడదు. ఉన్నత స్థాయి అధికారుల్లో కొద్ది మందికి మాత్రమే ఫోన్ వాడే వెసులుబాటు ఉంటుంది.
ఈ సారి బడ్జెట్ సమావేశాలు ఇలా..!
ఈ సారి బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రి. బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి. అయితే కరోనా భయాల నడుమ.. పార్లమెంట్ ఉభయ సభలు బడ్జెట్ రోజున మినహా మిగతా రోజుల్లో షిఫ్టుల వారీగా (Budget sessions 2022) జరగనున్నాయ.