భారత వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు అనేక ప్రణాళికలు ఆవిష్కరించారు. పంట అంచనా కోసం కిసాన్ డ్రోన్‌లను వినియోగించడాన్ని ప్రోత్సహించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం యోచిస్తోందని ఆమె తెలిపారు.
భారత వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( central finance minister nirmala sitharaman) నేడు అనేక ప్రణాళికలు ఆవిష్కరించారు. పంట అంచనా కోసం కిసాన్ డ్రోన్‌లను (kisan drones) వినియోగించడాన్ని ప్రోత్సహించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం యోచిస్తోందని ఆమె తెలిపారు. తప్పులను తగ్గించడానికి, సులభంగా యాక్సెస్ చేయడానికి అన్ని భూ రికార్డులను డిజిటలైజ్ (digilazation) చేస్తామని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. పురుగు మందులు, పోషకాలను పిచికారీ కోసం డ్రోన్ లను ప్రొత్సహిస్తామని తెలిపారు.
వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల గ్రామీణ పరిశ్రమల స్టార్టప్ (startup)లకు నాబార్ద్ ద్వారా ఆర్థిక సాయం, నిధులు అందజేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. స్టార్టప్‌లు FPOలకు మద్దతును, సాంకేతిక సహాయాన్ని అందిస్తాయని చెప్పారు.
undefined
నూనె గింజల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు హేతుబద్ధమైన, సమగ్ర పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతులకు డిజిటల్, హైటెక్ సేవలను అందించడానికి పబ్లిక్ ప్రైవేట్ పాట్నర్ షిప్ (PPP) విధానంలో ఓ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఎక్స్‌ప్రెస్‌వేల కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పీఎం గతి శక్తి మాస్టర్‌ప్లాన్ వల్ల ప్రజలు వేగంగా రవాణా సదుపాయం పొందనున్నారు. సేంద్రీయ వ్యవసాయం, అధునాతన వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నామని నిర్మలాసీతారమన్ తెలిపారు. రసాయనాలు లేని వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఆమె అన్నారు. ప్రస్తుత కోవిడ్ సమయంలో ఇలాంటి ఆహారం చాలా ముఖ్యమైనదని అభిప్రాయపడ్డారు.
ఎమ్‌ఎస్‌పీ కార్యకలాపాల కింద గోధుమలు, వరి సేకరణకు భారత ప్రభుత్వం రూ. 2.37 లక్షల కోట్లు చెల్లిస్తుందని నిర్మలాసీతారామన్ అన్నారు. 44,605 కోట్ల అంచనా వ్యయంతో కెన్-బెత్వా నదుల అనుసంధానం అమలును కూడా చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాలన్నీ దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తాయని అన్నారు. 2022-23ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించామని తెలిపారు. చిన్న రైతులు, MSMEల కోసం రైల్వే కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేస్తుందని మంత్రి తెలిపారు.