Different types of budgets: బడ్జెట్ ఎన్ని రకాలో తెలుసా..?

By team telugu  |  First Published Feb 1, 2022, 2:25 PM IST

బడ్జెట్ అంటే ఒక ఏడాది కాలానికి దేశంలో ఖర్చులు. ఆదాయం వర్సెస్ ఖర్చుల వివరాలు. బడ్జెట్ అందరికీ అర్ధం కానే కాదు. బ‌డ్జెట్ ఎన్ని ర‌కాలో ఇప్పుడు తెలుసుకుందాం..!
 


బడ్జెట్ అంటే ఒక ఏడాది కాలానికి దేశంలో ఖర్చులు. ఆదాయం వర్సెస్ ఖర్చుల వివరాలు. బడ్జెట్ అందరికీ అర్ధం కానే కాదు. బ‌డ్జెట్ ఎన్ని ర‌కాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

ఆదాయ, వ్యయాల మధ్యగల సంబంధాన్ని బట్టి బడ్జెట్ రెండు రకాలు:
(1) సంతులిత బడ్జెట్: రాబోయే ఆదాయం, చేయబోయే ఖర్పులు సమానంగా ఉన్నట్లయితే దానిని సంతులిత బడ్జెట్ అంటారు.
(2) అసంతులిత బడ్జెట్: ఆదాయ, వ్యయాల మధ్య అసమానతలు ఉన్న బడ్జెట్ ను అసంతులిత బడ్జెట్ అంటారు. 

Latest Videos

అసంతులిత బడ్జెట్ రెండు రకాలు: 
(అ) మిగులు బడ్జెట్: రాబోయే ఆదాయం ఎక్కువగా ఉండి, చేయబోయే ఖర్చులు తక్కువగా ఉన్నట్లయితే దానిని మిగులు బడ్జెట్ అంటారు. ఈ తరహా బడ్జెట్ ను ద్రవ్యోల్బణ కాలంలో అనుసరిస్తారు.
(ఆ) లోటు బడ్జెట్: రాబోయే ఆదాయం తక్కువగా ఉండి, చేయబోయే ఖర్చులు ఎక్కువగా ఉన్నట్లయితే దానిని లోటు బడ్జెట్ అంటారు. ఈ తరహా బడ్జెట్ ను ఆర్థిక మాంద్యంలో లేదా ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో అనుసరిస్తారు. 

లోటు బడ్జెట్ 5 రకాలు: 
(A) రెవెన్యు లోటు: రెవెన్యు ఆదాయం తక్కువ, రెవెన్యు వ్యయం ఎక్కువ 
(B) మూలధన లోటు: మూలధన ఆదాయం తక్కువ, మూలధన వ్యయం ఎక్కువ 
(C) బడ్జెట్ లోటు: మొత్తం ఆదాయం తక్కువ, మొత్తం వ్యయం ఎక్కువ 
(D) కోష లోటు: బడ్జెట్ లోటు మరియు ఇతర అప్పుల మొత్తం.
కోష లోటునే ద్రవ్య లోటు, విత్త లోటు, ఫిసిక్కల్ లోటు అంటారు. 
(E) ప్రాథమిక లోటు: కోష లోటు నుండి వడ్బి చెల్లింపులను తీసివేయగా మిగిలిన దానిని ప్రాధమిక లోటు ఉంటారు.

బడ్జెట్ లో ప్రభుత్వం చేసే ఖర్చును రెండు రకాలుగా వర్గీకరించారు.
(1) ప్రణాళికా వ్యయం:

ప్రణాళికలో పేర్కొన్న సాధారణ పరిపాలన నిమిత్తం చేసే ఖర్చును ప్రణాళికా వ్యయం అంటారు.
ఇది రెండు రకాలు: (A) రెవెన్యు వ్యయం (B) మూలధన వ్యయం
(2) ప్రణాళికేతర వ్యయం:
మూలధన ఆస్తులను సమకూర్చుకోవడానికై చేసే ఖర్చును ప్రణాళికలో ప్రస్తావించకుండా చేసే ఖర్చును ప్రణాళికేతర వ్యయం అంటారు.
ఇది రెండు రకాలు: 
(A) రెవెన్యు వ్యయం: రెవెన్యు ఖాతాలపై చేయబడిన ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయాల మొత్తం. 
(B) మూలధన వ్యయం: మూలధన ఖాతాలపై చేయబడిన ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయాల మొత్తం.

click me!