Budget2024: ఏపీ, తెలంగాణకు గణనీయంగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

By Mahesh K  |  First Published Feb 1, 2024, 3:26 PM IST

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రైల్వే కోసం గణనీయంగా బడ్జెట్ కేటాయింపులు జరిగినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రానికి అప్పటి ప్రభుత్వం జరిపిన కేటాయింపులకు తాము ఎన్నో రెట్లు అధికంగా కేటాయింపులు జరిపినట్టు వివరించారు. 
 


Budget 2024: ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రైల్వే కోసం గణనీయంగా కేటాయింపులు చేసినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినట్టు వివరించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికీ మంచి కేటాయింపులే జరిపినట్టు తెలిపారు.

2009 -14 ఆర్థిక సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 886 కోట్లు అని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ గుర్తు చేశారు. అదే తమ ప్రభుత్వం ఈ నిధులను భారీగా పెంచిందని వివరించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు రూ. 9,138 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. 97 శాతం ట్రాక్స్‌కు విద్యుద్దీకరణ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. అలాగే, 72 స్టేషన్లను అమృత్ స్టేషన్‌లుగా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. 

Latest Videos

Also Read : PM Vishwakarma Yojana: ఈ వృత్తుల వారికి అతి తక్కువ వడ్డీకే రూ. 2 లక్షలు లోన్ పొందే పథకం ఇదే.. ఇలా పొందవచ్చు

ఇక తెలంగాణ విషయానికి వస్తే ఈ ఏడాది తెలంగాణకు రూ. 5,071 కోట్ల నిధులు కేటాయించినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కాగా, ఈ రాష్ట్రంలో వంద శాతం ట్రాక్స్ విద్యుద్దీకరణ పూర్తయిందని తెలిపారు. ఇక 40 అమృత్ స్టేషన్లను నిర్మిస్తున్నట్టు వివరించారు.

click me!