expects from Union budget 2022: బ‌డ్జెట్‌లో హెల్త్ సెక్టార్ ఏం కోరుకుంటుంది..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 30, 2022, 03:58 PM ISTUpdated : Jan 30, 2022, 04:12 PM IST
expects from Union budget 2022: బ‌డ్జెట్‌లో హెల్త్ సెక్టార్ ఏం కోరుకుంటుంది..?

సారాంశం

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరో రెండు రోజుల్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజానీకంపై భారీ ప్రభావం చూపింది. ఆర్థిక ప్రభావంతో పాటు ఆరోగ్యం పైనా ప్రభావం చూపింది.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరో రెండు రోజుల్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజానీకంపై భారీ ప్రభావం చూపింది. ఆర్థిక ప్రభావంతో పాటు ఆరోగ్యం పైనా ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యరంగానికి పెద్ద పీట వేయడంతో పాటు, హెల్త్ ఇన్సురెన్స్, హెల్త్ చికిత్సకు సంబంధించి పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని కోరుతున్నారు. కరోనా ప్రారంభం నుండి అందరి వైద్య ఖర్చులు పెరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌ను మే 2020లో ప్రారంభించారు. 2020 నవంబర్ నెలలో మరింత ప్యాకేజీని ప్రకటించారు. చిన్న వ్యాపారుల నుండి ఎస్ఎంఎస్ఈల వరకు ప్యాకేజీని ప్రకటించారు. తద్వారా ఆర్థిక రికవరీకి ప్యాకేజీ దోహదపడింది.

పెరిగిన జనాభా
ఆరోగ్య సంరక్షణ కోసం బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని వైద్య రంగ నిపుణులు కోరుతున్నారు. గత దశాబ్ద కాలంలో దేశ జనాభా దాదాపు పదిహేను శాతం పెరిగిందని, అందుకు తగినట్లుగా ఆరోగ్య సంరక్షణ వ్యయం లేదని అంటున్నారు. బడ్జెట్‌లో ప్రజారోగ్య వ్యయాన్ని 2.5 శాతం నుండి 3.5 శాతానికి పెంచవలసిన అవసరముందన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజీ లక్ష్యాలకు మద్తతిచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అందరినీ ఆరోగ్య కవరేజీ పరిధిలోకి తీసుకు రావడానికి ప్రత్యామ్నాయ ఫైనాన్సింగ్ విధానాలు ఉండాలని చెబుతున్నారు.

బడ్జెట్‌లో అధిక కేటాయింపులు 
వ్యాక్సిన్ పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేసింది. అయితే ప్రజారోగ్యం కోసం బడ్జెట్ కేటాయింపుల్లో ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆరోగ్య క్లిష్ట పరిస్థితుల్లో కేటాయింపులు ఎక్కువగా ఉండాలని అంటున్నారు. ఆరోగ్యం, ఆరోగ్య మౌలిక సదుపాయాలపై ఈ బడ్జెట్‌లో కేటాయింపులకు అధిక ప్రాధాన్యత ఉంటుందని ఆర్థిక నిపుణుల మాట.

మరిన్ని..!
వివిధ మెడికల్ ఎక్విప్‌మెంట్స్, డివైస్‌లు, ఇన్‌స్ట్రుమెంట్స్ పైన జీఎస్టీ రేటు 12 శాతంగా ఉంది. దీనిని 5 శాతానికి తగ్గించాలని ఆరోగ్య రంగ నిపుణులు కోరుతున్నారు. హ్యాండ్ శానిటైజర్స్ జీఎస్టీ క్లాసిఫికేషన్ ఉంటుందని భావిస్తున్నారు. ఎక్స్‌పైర్డ్ మెడిసిన్ గూడ్స్ అంశంపై కూడా ఆశలు ఉన్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Budget 2025: మధ్య తరగతికి భారీ ఉపశమనం, నిర్మలా సీతారామన్ ఎవరికి ఏమిచ్చారో పూర్తి డిటైల్స్
Budget 2025 హైలైట్స్, కొత్త ఆదాయ పన్ను, పూర్తి వివరాలు