Sun Pharma: మేకింగ్ ఇండియా హార్ట్ స్ట్రాంగ్‌.. వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన స‌న్ ఫార్మా

Published : Mar 19, 2026, 04:54 PM IST
Sun Pharma

సారాంశం

Sun Pharma: మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారం, వ్యాయామం త‌గ్గ‌డం కార‌ణం ఏదైనా ఇటీవ‌ల దేశంలో గుండె సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ ఫార్మా కంపెనీ స‌న్ ఫార్మా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

సన్ ఫార్మా త‌న‌ హార్ట్ కే లియే 8 – మేకింగ్ ఇండియా హార్ట్ స్ట్రాంగ్’క్యాంపెయిన్ ద్వారా భారతీయులను గుండె ఆరోగ్యానికి సంబంధించి రోజువారి పనుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలని కోరుతోంది. డ‌యాబెటిస్ చికిత్స‌లో గ‌ణ‌నీయ‌మైన ఉణికి క‌లిగి ఉన్న స‌న్ ఫార్మా.. రోజురోజుకి పెరుగుతున్న గుండె సంబంధిత వ్యాధుల చికిత్స పరిష్కారాలను కనుగొనడంలో కీల‌క పాత్ర పోషిస్తోంది.

భారతదేశంలో హృదయ సంబంధ వ్యాధుల (CVD) మరణాలు మొత్తం ప్రపంచ గుండె సంబంధిత మరణాల్లో దాదాపు ఐదవ వంతు ఉంటాయని రిపోర్టులు చెప్తున్నాయి. అదే విధంగా పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే భారతీయులు కనీసం ఒక దశాబ్దం ముందుగానే ఈ వ్యాధులకు ప్రభావితమయ్యారు. ‘హార్ట్ కే లియే 8 – మేకింగ్ ఇండియా హార్ట్ స్ట్రాంగ్’ క్యాంపెయిన్ ద్వారా మనం క్రమం తప్పకుండా చేసే చిన్న చిన్న పనుల గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకోవచ్చు.

"సన్ ఫార్మాలో చికిత్స ఎంత ముఖ్యమో నివారణ కూడా అంతే ముఖ్యమని మేం నమ్ముతున్నాం. ‘హార్ట్ కే లియే 8 – మేకింగ్ ఇండియా హార్ట్ స్ట్రాంగ్’ తో, గుండె ఆరోగ్యం గురించి రోజు మాట్లాడుకోవాలని, తద్వారా గుండెం సంబంధిత జబ్బులతో ప్రతీ ఒక్కరికీ అవగాహన ఏర్పడుతుందని మేం భావిస్తున్నాము. ప్రతిరోజూమనం చేసుకున్న చిన్న చిన్న మార్పులే పెద్దతేడాను కలిగిస్తాయని, ఈ విషయాన్ని మన దేశ ప్రజలంతా గుర్తించడంలో సహాయపడాలనిమేముకోరుకుంటున్నాము. బలమైన హృదయం యాదృచ్ఛికంగా కాదు, మనం ప్రతిరోజూచేసే ఎంపికల ద్వారా నిర్మిత‌మ‌వుతుంది" అని స‌న్ ఫార్మా మార్కెటింగ్ అండ్ సేల్స్సీనియర్ VP శైలేష్జోషి చెప్పుకొచ్చారు.

ఈ క్యాంపెయిన్ లో ప్రధానంగా ‘హార్ట్ స్ట్రాంగ్ మ్యాన్’ అనే పాత్రను పరిచయం చేశారు. ఇది సమతుల జీవనశైలి ద్వారా హార్ట్ స్ట్రాంగ్ మ్యాన్ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, అలా ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. అంతేకాకుండా అలా ఉండటానికి ఏం చెయ్యాలో కూడా చెప్తాడు. అవగాహన కలిగిస్తాడు. దీనిద్వారా అందరిలో సానుకూల, సాధికారత, ఆచరించాలనే తపన మొదలవుతుంది. ప్రజలు ఎలాంటి భయం, ఆందోళన లేకుండా వారి గుండె ఆరోగ్యాన్ని బాధ్యతగా తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. ఈ క్యాంపెయిన్ వివిధ భారతీయ భాషల్లో ప్రజల కోసం సిద్ధంగా ఉంది. ఈ ప్రచారం గుండె ఆరోగ్యానికి అవసరమైన ఎనిమిది ముఖ్యమైన అంశాల చుట్టూ కేంద్రీకృతమై ఉంది:

1) ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం

2) శారీరకంగా చురుకుగా ఉండటం.

3) బరువుని నియంత్రణలో ఉంచుకోవడం

4) రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం

5) పొగాకు వాడకాన్ని నివారించడం

6) క్రమం తప్పకుండా గుండెం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం

7) ఒత్తిడిని తగ్గించుకోవడం

8) మంచి నిద్ర పొందడం

సన్ ఫార్మా ‘మేకింగ్ ఇండియా హార్ట్ స్ట్రాంగ్’ కార్యక్రమం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సమగ్రంగా విస్తృత నివారణ, అత్యవసర ప్రతిస్పందన లాంటి ముఖ్యమైన విషయాల్ని ప్రతీ ఒక్కరికీ తెలియాలనే సమగ్రవిధానాన్నితీసుకుంటుంది

* హార్ట్ స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించడం – ప్రతి సంవత్సరం 10,000 శిబిరాల ద్వారా 1.2 మందికి పైగా పరీక్షలు

* అత్యవసర పరిస్ధితుల కోసం CPR శిక్షణ - ప్రతి సంవత్సరం 1.5 లక్షల మందికి పైగా వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం

* ప్రమాదాన్ని ముందుగానే గుర్తించ‌డం, ఫలితాల ఆధారంగా రోగికి చెప్పడం

* రోగుల అవగాహన పెంచడం – క్లినిక్ లలో సమాచార పత్రాలతో పాటు అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రతి సంవత్సరం 15 మిలియన్లకు పైగా వ్యక్తులను గుర్తించి అవగాహన కలిగించడం.

ఈ ప్రయత్నాలన్నీ కలిసి గుండెకు సంబంధించిన సమస్యల నివారణ, ప్రతిస్పందనతో పాటు మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగాపెట్టుకున్నాయి, భారత దేశంలో హృదయ సంబంధిత వ్యాధుల భారాన్ని దీర్ఘకాలికంగా తగ్గించడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి.

సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (CIN - L24230GJ1993PLC019050) గురించి

ఫార్మా ప్రపంచంలో ప్రముఖ స్పెషాలిటీ జెనరిక్ ఔషధ కంపెనీలలో సన్ ఫార్మా ఒకటి. ఇది ఇన్నోవేటివ్ మెడిసిన్స్, జెనరిక్ ఔషధాలు, కన్జ్యూమర్ హెల్త్‌కేర్ ఉత్పత్తుల రంగాల్లో పనిచేస్తోంది. ఇది భారతదేశంలో అతిపెద్ద ఔషధ సంస్థ కాగా, అమెరికాలో ప్రముఖ జెనరిక్ కంపెనీగా కూడా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ప్రపంచంలోని ఎమర్జింగ్ మార్కెట్లలో కూడా ఇది ప్రముఖ స్థానం కలిగి ఉంది.

సన్ ఫార్మా హై-గ్రోత్ గ్లోబల్ ఇన్నోవేటివ్ మెడిసిన్స్ పోర్ట్‌ఫోలియోలో డెర్మటాలజీ, ఆఫ్తాల్మాలజీ, ఆంకో-డెర్మటాలజీ రంగాల్లో ఉన్న ఆధునిక ఔషధాలు ఉన్నాయి. ఈ విభాగం కంపెనీ మొత్తం అమ్మకాలలో సుమారు 20% వాటాను కలిగి ఉంది.

కంపెనీ పూర్తిగా సమగ్ర (Vertically Integrated) విధానంతో పనిచేస్తూ, అధిక నాణ్యత గల ఔషధాలను తయారు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో వైద్యులు, వినియోగదారులు వీటిపై నమ్మకం ఉంచుతున్నారు.

సన్ ఫార్మా తయారీ యూనిట్లు ఐదు ఖండాల్లో విస్తరించి ఉన్నాయి. అలాగే, 50కి పైగా దేశాలకు చెందిన ఉద్యోగులతో కూడిన బహుళ సాంస్కృతిక వాతావరణాన్ని ఈ సంస్థ గర్వంగా కలిగి ఉంది. మ‌రింత స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ www.sunpharma.com సంద‌ర్శించండి. అలాగే, LinkedIn, X లో కూడా ఫాలో కావచ్చు.

PREV
Brand Promotion Articles (బ్రాండ్ ప్రమోషన్ కథనాలు): Explore brand stories featuring partner content, brand collaborations, and sponsored insights. Read engaging branded narratives, campaigns, and initiatives on Asianet News Telugu.
Read more Articles on
click me!

Recommended Stories

OPPO Reno15c: మిడ్ రేంజ్ ధ‌ర‌లో ప్రీమియం ఫీచ‌ర్లు.. ఒప్పో నుంచి క‌ళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్
Valentines Day: వాలెంటైన్స్ డే స్పెషల్.. శ్రీ జగదాంబా పెర్ల్స్ లో ఈ 5 ఆభరణాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!