విపణిలోకి ట్రయంఫ్‌ ‘స్పీడ్‌ ట్విన్‌’: ధరెంతో తెలుసా?

By rajashekhar garrepally  |  First Published Apr 25, 2019, 11:38 AM IST

బ్రిటన్ ఆటోమొబైల్ మేజర్ ట్రయంఫ్ మార్కెట్లోకి స్పీడ్ ట్విన్ మోడల్ మోటారు సైకిళ్లను ఆవిష్కరించింది.


న్యూఢిల్లీ: బ్రిటన్ ఆటోమొబైల్ దిగ్గజం సూపర్‌బైక్స్‌ తయారీ కంపెనీ ట్రయంఫ్ నూతన మోడల్‘స్పీడ్‌ ట్విన్‌ 2019’ మోటారు సైకిళ్లను బుధవారం విపణిలోకి ప్రవేశపెట్టింది. 1200–సీసీ ఇంజిన్‌ సామర్థ్యం కలిగిన ఈ సూపర్‌బైక్‌ ధర రూ.9.46 లక్షలు. 

ఈ సందర్భంగా సంస్థ జనరల్‌ మేనేజర్‌ షోయబ్‌ ఫరూఖ్‌ మాట్లాడుతూ ‘భారత రైడర్ల కోసం ట్రయంఫ్‌ లగ్జరీ మోటార్‌ సైకిళ్ల పరిధి చాలా విస్తృతంగా ఉంది. మా ఉనికిని చాటుకునేలా అత్యాధునిక సూపర్‌బైక్స్‌ను ఇక్కడి మార్కెట్‌కు పరిచయం చేయడంపై దృష్టి పెట్టాం’ అని అన్నారు.

Latest Videos

undefined

ఇక సంస్థ జూలై–జూన్‌ ఆర్థిక సంవత్సరాన్ని కొనసాగిస్తుండగా.. ఈ కాలంలో 1,150 నుంచి 1,250 యూనిట్ల వరకు విక్రయించే అవకాశం ఉన్నదని తెలిపింది.

రూ.5 లక్షల బైక్‌ల విభాగంలో ఈ కంపెనీకి 16 శాతం మార్కెట్‌ వాటా ఉంది. గత ఫిబ్రవరిలో కంపెనీ స్ట్రీట్ ట్విన్‌, స్ట్రీట్ స్క్రాంబ్లర్‌ వెర్షన్లను మార్కెట్లోకి తెచ్చింది. 

కొత్త బైక్‌లను మార్కెట్లో ఆవిష్కరించడం ద్వారా దేశీయ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నది కంపెనీ వ్యూహం. ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రతికూల వృద్ధి నమోదు అవుతున్న తరుణంలో ట్రయంఫ్ కంపెనీ మాత్రం మెరుగైన వృద్ధిని ఆశిస్తోంది. 

భారతదేశ మార్కెట్ పరిధిలో 13-14 ప్రొడక్ట్స్ జత చేర్చనున్నట్లు ట్రయంఫ్ ఇండియా జనరల్‌ మేనేజర్‌ షోయబ్‌ ఫరూఖ్‌ చెప్పారు. ఫ్యాక్టరీ కస్టమ్స్, రోడ్ స్టర్స్, అడ్వెంచర్ సెగ్మెంట్ల విభాగాల్లో 24 శాతం, మిగతా 22 శాతం సేల్స్ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్నాయన్నారు. 500 సీసీ సెగ్మెంట్‌లో గ్రోత్ 22 శాతం నమోదవుతున్నది. గత నాలుగైదు నెలల్లో నాలుగు ఉత్పత్తులను ప్రవేశపెట్టినట్లు షోయబ్ ఫరూఖ్ తెలిపారు. 

దీర్ఘ కాలంలో సీకేడీ విభాగంపై ప్రత్యేకించి ద్రుష్టిని సారించామని  ట్రయంఫ్ ఇండియా జనరల్‌ మేనేజర్‌ షోయబ్‌ ఫరూఖ్‌ తెలిపారు. నూతన విధానం ప్రకారం ఎటువంటి దిగుమతి సుంకం లేకుండా 2,500 మోటారు బైక్‌ల వరకు దిగుమతి చేసుకోవచ్చు. అంతర్జాతీయంగా బ్రిటిష్ సూపర్ బైక్ మేకర్ సీకేడీ ఉత్పాదక కేంద్రాలు ఏర్పాటు చేసిన ఐదు దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. 

సంబంధిత వార్తలు:

కొత్త హంగులతో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500: ప్రీ బుకింగ్స్ షురూ!

భారత మార్కెట్లోకి Suzuki GSX-S750: ధరెంతో తెలుసా?

ఏది బెటర్?: హోండా యాక్టివా 5జీ Vs టీవీఎస్ జూపిటర్

 

click me!