హీరో మోటో కార్ప్ సంస్థ విపణిలోకి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన మోడల్ మోటార్ సైకిల్ హెచ్ఎఫ్ బైక్ ను ఆవిష్కరించింది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.52,925గా నిర్ణయించారు.
న్యూఢిల్లీ : ప్రముఖ దేశీయ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారతీయ విపణిలోకి బీఎస్-6 ప్రమాణాలు కల హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌ను విడుదలచేసింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 55,925 - రూ. 57,250గా కంపెనీ నిర్ణయించింది. మొత్తం రెండు వేరియంట్లలో ఈ బైక్‌ను అందుబాటులోకి తేనున్నట్లు హీరో సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
త్వరలో హీరో అన్ని మోడళ్లను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేస్తామని హీరో మోటో కార్ప్ ఒక ప్రకటనలో తెలింది. ఈ కొత్త హెచ్‌ఎఫ్ డీలక్స్ మోడల్‌లో బీఎస్-6 100సీసీ ఫ్యూయల్ ఇన్‌జెక్షన్ ఇంజిన్‌ను అమర్చారు. దీనికి పది సెన్సార్లతో ఎక్స్‌సెన్స్ అనే టెక్నాలజీని జోడించారు.
undefined
ఈ బైక్ 8,000 ఆర్పీఎం వద్ద 7.94 బీహెచ్పీ శక్తిని, 6,000 ఆర్‌పీఎం వద్ద 8.05 ఎన్‌ఎం టార్చిని విడుదల చేస్తుంది. పాత మోడల్ కంటే బీఎస్-6 హెచ్‌ఎఫ్ డీలక్స్ తొమ్మిది శాతం అధిక మైలేజీని ఇస్తుందని హీరో మోటోకార్ఫ్ తెలిపింది. ఇతర మోడల్ మోటారు సైకిళ్లలో మాదిరిగానే డీలక్స్ హెచ్ఎఫ్ బైక్ లోనూ ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టం (ఐ3ఎస్)ని అమర్చారు.
‘‘గత కొద్దికాలంగా హీరో మోటోకార్ఫ్ బీఎస్-6 ప్రమాణాలను అందుకునేందుకు కృషి చేస్తోంది. ఇది కేవలం సంస్థ ప్రయోజనాల కోసం మాత్రమే కాదు, వాటాదారులు, పరిశ్రమ, వినియోగ దారులను సుస్థిరపరచుకునే దిశగా హీరో సంస్థ ముందుకు సాగుతున్నది. మా ఉత్పత్తుల్లో అతి ముఖ్యమైన హెచ్‌ఎఫ్ డీలక్స్ మోడల్‌ను బీఎస్-6కు అనుగుణంగా మార్చటం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాం. దీనితో పాటు బైక్ పనితీరు, సామర్థ్యం, రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరరిచాం. త్వరలోనే బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా మరిన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తాం’ అని హీరో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమ్ కస్బేకర్ తెలిపారు.
హీరోమోటో కొత్త ఏడాదిలో సరికొత్త బైక్‌ను లాంచ్ చేసింది.100సీసీ సెగ్మెంట్‌లో బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తన తొలి మోటార్ సైకిల్ తీసుకొచ్చింది. హెచ్‌ఎఫ్ డీలక్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ బైక్ ప్రారంభ ధరను రూ. 55925 గా నిర్ణయించిం