అదరగొడుతున్న పియాజియో రెండు కొత్త స్కూటర్లు...

By Sandra Ashok Kumar  |  First Published Feb 6, 2020, 4:49 PM IST

కొత్త అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 పియాజియో బారామతి ఫ్యాక్టరీలో ఈ స్కూటర్లును తయారు చేస్తారు. 2020 అక్టోబర్ నుండి డిసెంబరులో మధ్యలో వీటిని  ప్రారంభించాలని భావిస్తున్నారు.


ఇటాలియన్ తయారీదారు పియాజియో కంపెనీ ప్రీమియం స్కూటర్ అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ను భారతదేశంలో ఆవిష్కరించింది. కొత్త అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 పియాజియో బారామతి ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. 2020 అక్టోబర్ నుండి డిసెంబరులో మధ్యలో వీటిని  ప్రారంభించాలని భావిస్తున్నారు.

also read మారుతి సుజుకి నుండి కొత్త హైబ్రిడ్ కారు లాంచ్

Latest Videos

undefined

పియాజియో కంపెనీ వెస్పా ఎలెట్రికా అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ ని కూడా ప్రదర్శించింది. ఈ  కొత్త వెస్పా ఎలెట్ట్రికా భారతదేశంలో తయారు చేస్తారు. పియాజియో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ డియెగో గ్రాఫి మాట్లాడుతూ "మా వినియోగదారుల అవసరాలను తీర్చడానికి కొత్త ప్రాడక్ట్స్ పరిచయం చేస్తున్నందుకు  మాకు ఎంతో గర్వంగా ఉంది.

అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 కొత్త కేటగిరీ బెంచ్ మార్క్ ను సాధిస్తుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన వ్యవస్థలో పెరుగుతున్న మార్పులతో, స్థానిక వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని పియాజియో ఇండియా భారతదేశంలో వినూత్న ఎలక్ట్రిక్-మొబిలిటీ పరిష్కారాలను ప్రవేశపెట్టే పనిలో ఉంది. ఐదేళ్లలో ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్‌ను అనుసరించాలని కంపెనీ యోచిస్తోంది.

also read ఇండియాలో లాంచ్ అయిన రేంజ్ రోవర్ కొత్త మోడల్ కార్

"గత కొన్నేళ్లుగా భారతీయ వినియోగదారులలో మారుతున్న ప్రాధాన్యతలను చూశాము. ఆ మార్పులకు అనుగుణంగా భారతదేశానికి ఎలక్ట్రిక్-మొబిలిటీ సొల్యూషన్స్ రూపకల్పన కోసం మేము మల్టీ వేదికలను అన్వేషిస్తున్నాము" అని గ్రాఫి అన్నారు. ఇటలీలో రూపకల్పన చేసిన ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ 160 సిసి బిఎస్ -6 & 125 సిసి బిఎస్ -6 ఇంజన్ ఆప్షన్లలో వస్తుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎల్‌ఈడీ హెడ్ లైట్, టైల్ లైట్స్, యుఎస్‌బి ఛార్జింగ్ ఉన్న స్ప్లిట్ గ్లోవ్ బాక్స్, డిజిటల్ క్లస్టర్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్‌కు క్రోమ్ గార్నిష్ ఎగ్జాస్ట్‌తో పాటు 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. అప్రిలియా  ఎస్ఎక్స్ఆర్ 160 బ్లూ, వైట్, రెడ్, బ్లాక్ అనే నాలుగు వేర్వేరు రంగులలో లభిస్తుంది. అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 కోసం బుకింగ్‌లు ఆగస్టు 2020లో ఆన్‌లైన్‌లో ప్రారంభమవుతాయి.
 

click me!