మార్కెట్లోకి బజాజ్ కొత్త బీఎస్‌-6 బైక్స్...

By Sandra Ashok Kumar  |  First Published Jan 29, 2020, 1:10 PM IST

సుప్రీంకోర్టు.. అటుపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాల విడుదలకు ఆటోమొబైల్ సంస్థలు క్యూ కట్టాయి. తాజాగా విపణిలోకి సిటీ, ప్లాటినా మోడల్ బైక్‌లను ఆవిష్కరించింది. బీఎస్-4 ప్రమాణాలతో పోలిస్తే బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న బజాజ్ సిటీ, ప్లాటినా మోడల్ బైక్స్ ధర రూ.6,368 ఎక్కువ.


న్యూఢిల్లీ: బజాజ్ ఆటోమొబైల్ బీఎస్-6 ప్రమాణాలతో కూడిన బైక్‌లను విడుదల చేయడంలో బిజీబిజీగా ఉంది. తాజాగా  తమ పాపులర్‌ టూవీలర్‌ మోడల్స్‌ సిటీ, ప్లాటినాలను మార్కెట్‌కు పరిచయం చేసింది‌.

బజాజ్‌ సిటీ 100సీసీ, 110సీసీ మోడల్ బైక్‌ల ప్రారంభ ధర రూ.40,794గా నిర్ణయించారు. బజాజ్‌ ప్లాటినా 100 సీసీ, 110 సీసీ హెచ్‌-గేర్‌ ఆరంభ ధర రూ.47,264గా నిర్ణయించింది బజాజ్ ఆటో. కంపెనీ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ రూపొందించిన ఎలక్ట్రిక్‌ ఇంజెక్షన్‌ (ఈఐ) వ్యవస్థతో ఈ కొత్త మోడల్స్‌ కస్టమర్లకు లభించనున్నాయి.

Latest Videos

undefined

also read టాటా నెక్సాన్ ఈ‌వి కార్ లాంచ్...ధర ఎంతంటే..?

బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా ప్లాటినా 100 ఎలక్ట్రిక్‌ బైక్ ధర రూ.54,797గా బజాజ్ ఆటోమొబైల్ నిర్ణయించింది.బీఎస్‌-4 శ్రేణి ధర కంటే ఇది రూ.6,368 అధికం. ‘ఈ సరికొత్త మోడల్స్‌తో బీఎస్‌-6 శ్రేణిలోకి బజాజ్‌ ప్రవేశించిట్లయింది’ అని బజాజ్‌ ఆటో మోటర్‌సైకిల్‌ విభాగం అధ్యక్షుడు సరంగ్‌ కనడే తెలిపారు. 

త్వరలోనే మిగతా మోడల్స్‌ వాహనాలనూ బీఎస్‌-6 శ్రేణిలో మార్కెట్‌కు పరిచయం చేస్తామని బజాజ్‌ ఆటో మోటర్‌సైకిల్‌ విభాగం అధ్యక్షుడు సరంగ్‌ కనడే అన్నారు. ఈఐ వ్యవస్థతో ఇంజిన్‌ పనితీరు మృదువుగా మారుతుందని, మైలేజీ కూడా మెరుగుపడుతుందని వివరించారు.

also read భారత్ బెంజ్ నుంచి కొత్త బి‌ఎస్ 6 ట్రక్కులు & బస్సులు

బీఎస్-6 స్వదేశీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న బజాజ్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో కూడుకున్న ప్లాటినా, సిటీ బైక్‌లను తయారు చేసింది. వీటిలో నూతన ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఇంజిన్లకు గార్డుగా ఉపకరిస్తాయి. ఈ బైక్‌లు 100 సీసీ, 110 సీసీ ఇంజిన్ల సామర్థ్యంతో, హెచ్-గేర్ మోడల్‌తో పని చేయనున్నాయి. 

click me!