కొత్త ఎలక్ట్రిక్ బైక్....అదిరిపోయే మైలేజ్....

By Sandra Ashok KumarFirst Published Dec 27, 2019, 3:12 PM IST
Highlights

ఓకినావ కంపెనీ నుండి ఓకి100 ఎలక్ట్రిక్ బైక్ 125 సిసి ఇంజన్ తో రానుంది. రివాల్ట్ ఆర్‌వి 400 కి పోటీగా ఈ బైక్ ఉంటుంది. ఫుల్ చార్జ్ తో 150 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది అలాగే 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

గురుగ్రామ్‌కు చెందిన ఒకినావా ఆటోటెక్ కంపెనీ మూడేళ్ల క్రితం ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రారంభించింది. ఇప్పుడు ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్స్  రంగంలోకి ప్రవేశించనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఓకినావా సహ వ్యవస్థాపకుడు, ఎండి  జీతేందర్ శర్మ కారాండ్‌బైక్‌ అభివృద్ధి పై మాట్లాడరు. తయారీదారు 2020 మొదటి త్రైమాసికంలో ఓకి100 ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకురానున్నారు.ఈ మోడల్ 125 సిసి బైక్ కి సమానంగా ఉంటుంది.

also read కొత్త సర్విస్...కేవలం మూడు గంటల్లో కార్ సర్వీసింగ్...


ఒకినావా 2018 ఆటో ఎక్స్‌పోలో ఓకి100 ప్రోటోటైప్‌ను ప్రదర్శించించారు. అయితే రెండేళ్ల క్రితం ప్రదర్శించిన మోడల్‌, ప్రస్తుతం ప్రొడక్షన్ మోడల్ ఎంత దగ్గరగా పోలి ఉంటుందో చూడాలి. గత రెండేళ్లుగా ఈ మోటారుసైకిల్ అభివృద్ధి చెందుతోంది వచ్చే ఫిబ్రవరిలో జరిగే 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రొడక్షన్-స్పెక్ వెర్షన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

మోటారుసైకిల్ 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకసారి  ఛార్జీ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు అని శర్మ వెల్లడించారు. ఎలక్ట్రిక్ బైక్ స్వాప్ చేయగల బ్యాటరీలతో, రెండు పవర్ మోడ్‌లతో  వస్తుంది. పవర్‌ట్రెయిన్ లేదా బ్యాటరీ సామర్థ్యంపై కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. 

also read  దుమ్ము రేపుతున్న బీఎస్-6 కొత్త మోడల్: ఒక్క నెలలో 60 వేల సేల్స్


ఒకినావా ఓకి100 బైక్ పూర్తిగా స్థానికంగా నిర్మించనున్నారు అని శర్మ తెలిపారు. కంపెనీ సుమారు దీని ధర సుమారు 1 లక్షల (ఎక్స్-షోరూమ్) నిర్ణయించనుంది. రివాల్ట్ RV300, RV400 బైక్ కంటే కూడా  దీని ధర తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ విభాగం ఇంకా కొత్తగా ఉంది మరియు ఒకినావా కూడా టార్క్ టి 6 ఎక్స్ ఇ-బైక్ నుండి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది.  దేశవ్యాప్తంగా సుమారు 300 డీలర్‌షిప్‌లు ఉన్నాయని, వచ్చే ఏడాది చివరి నాటికి తన నెట్‌వర్క్‌ను 500 అవుట్‌లెట్లకు పెంచాలని యోచిస్తోందని ఒకినావా పేర్కొంది.
 

click me!