క్రూజర్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించడంలో భాగంగా విడుదల చేసిన ఈ బైకు రూ.18.9 లక్షల నుంచి రూ.21.90 లక్షల మధ్యలో లభించనున్నది. ఈ బైకు కోసం శనివారం నుంచి దేశవ్యాప్తంగా అన్నీ రిటైల్ అవుట్‌లెట్లలో ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ‘ఆర్18 మోడల్'ను ఆవిష్కరించింది. క్రూజర్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించడంలో భాగంగా విడుదల చేసిన ఈ బైకు రూ.18.9 లక్షల నుంచి రూ.21.90 లక్షల మధ్యలో లభించనున్నది.
ఈ బైకు కోసం శనివారం నుంచి దేశవ్యాప్తంగా అన్నీ రిటైల్ అవుట్‌లెట్లలో ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. 1,802 సీసీ సామర్థ్యం ఉన్న ఈ బైకుకి ఆరు గేర్లు ఉన్నాయి.
undefined
also read ఎస్‌యూవీ స్టైల్‌లో మారుతి ఆల్టో నెక్స్ట్ జనరేషన్ మోడల్ కారు.. ...
బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 భారతదేశంలో 2 వేరియంట్లలో లభించే క్రూయిజర్ బైక్. దీని లో వెర్షన్ ధర రూ.18,90,000 (ఎక్స్-షోరూమ్) ధర నుండి టాప్ వెర్షన్ రూ.21,90,000 (ఎక్స్-షోరూమ్) ఉంది.
ఈ బిఎమ్‌డబ్ల్యూ బైకు 89.84 బిహెచ్‌పి పవర్, 158 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 వెనుక, ముందు టైర్లకు డ్రమ్ బ్రేక్‌లు అందించారు. ఈ బిక్ 345 కిలోల బరువు ఉంటుంది.