సైకిళ్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్ : ఇండియాలో ఈ సైకిల్ ధర ఎంతంటే?

By Sandra Ashok Kumar  |  First Published Sep 18, 2020, 11:31 AM IST

ప్రీమియం సైకిల్ తయారీ సంస్థ అయిన స్కాట్ స్పోర్ట్స్ ఇండియా బుధవారం పూర్తి సస్పెన్షన్ క్రాస్ కంట్రీ సైకిల్ స్పార్క్ ఆర్‌సి 900ను ప్రవేశపెట్టింది. దీని ధర ఇండియాలో అక్షరాల రూ.3.7 లక్షలు. ఒలింపిక్ విజేత నినో షుర్టర్, ప్రపంచ కప్ ఛాంపియన్ కేట్ కోర్ట్నీ వంటి వారు మెచ్చిన బ్రాండ్ తమదని కంపెనీ చెప్పింది. 


భారతదేశంలో కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కాలంలో సైకిళ్లకు డిమాండ్ పెరగడం వల్ల ప్రీమియం సైకిల్ తయారీ  సంస్థ స్కాట్ స్పోర్ట్స్ ఇండియా ఖరీదైన సైకిల్‌ను లాంచ్ చేసింది.

ప్రీమియం సైకిల్ తయారీ సంస్థ అయిన స్కాట్ స్పోర్ట్స్ ఇండియా బుధవారం పూర్తి సస్పెన్షన్ క్రాస్ కంట్రీ సైకిల్ స్పార్క్ ఆర్‌సి 900ను ప్రవేశపెట్టింది.

Latest Videos

undefined

దీని ధర ఇండియాలో అక్షరాల రూ.3.7 లక్షలు. ఒలింపిక్ విజేత నినో షుర్టర్, ప్రపంచ కప్ ఛాంపియన్ కేట్ కోర్ట్నీ వంటి వారు మెచ్చిన బ్రాండ్ తమదని కంపెనీ చెప్పింది.

also read 

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు సైకిళ్ల డిమాండ్ 70 శాతానికి పైగా పెరిగింది, అయితే రూ.30,000 కంటే ఎక్కువ ఖర్చుతో ప్రీమియం సైకిళ్ల కోసం డిమాండ్ దాదాపు 100 శాతం పెరిగినట్టు అంచనా.

చాలా జిమ్‌లు, ఫిట్‌నెస్ కేంద్రాలు మూతపడటంతో వినియోగదారులు ఫిట్‌గా ఉండటానికి సైక్లింగ్‌కు వైపు మొగ్గు చూపుతున్నారు. "గత కొన్ని నెలలుగా ప్రీమియం సైకిళ్ళలో అపూర్వమైన డిమాండ్ మేము చూశాము.

అధిక మన్నిక, సాంకేతికత, అధిక-నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందని" అని స్కాట్ స్పోర్ట్స్ ఇండియా కంట్రీ మేనేజర్ జయమిన్ షా చెప్పారు. సుమారు 5 లక్షల నుండి 6 లక్షల విలువ చేసే స్కాట్ అడిక్ట్ సిరీస్ సైకిళ్లకు చాలా ఆర్డర్‌లను వచ్చాయని, అందువల్ల మేము రాబోయే కొద్ది నెలల్లో భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రీమియం సైకిల్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాము. " అని తెలిపారు.

click me!