మార్కెట్లోకి కొత్త ఈ బైక్... ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు...

By Sandra Ashok Kumar  |  First Published Feb 7, 2020, 11:39 AM IST

ఐఐటీ హైదరాబాద్, ప్యూర్ ఈవీ అనే స్టార్టప్ సంయుక్తంగా తయారు చేసిన ‘ఈ-స్కూటర్’ విపణిలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల తొమ్మిదో తేదీన లాంఛనంగా విపణిలోకి ఆవిష్కరించనున్నది. 


హైదరాబాద్: ప్యూర్ ఈవీ స్టార్టప్, ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా తయారుచేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లు త్వరలో దేశీయ మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. సరసమైన ధరల్లోనే ఇవి వాహన వినియోగ దారులకు లభించనున్నాయని సమాచారం. 

ఈ బైక్‌ను ఒక్కసారి చార్జింగ్ చేస్తే 116 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ప్రయాణ ఖర్చు కూడా కిలోమీటర్‌కు 25 నుంచి 30 పైసలు మాత్రమే కావడం గమనార్హం. ఐసీఏటీ, సీఎంవీఆర్‌ల నుంచీ ఇప్పటికే అనుమతి రాగా, ఈ నెల 9వ తేదీన లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

Latest Videos

undefined

also read ఏపీ కియా మోటార్స్ కార్ల ఉత్పత్తి పెంపు... సంవత్సరానికి 3 లక్షలు 

ఇందుకు ఐఐటీ హైదరాబాద్ వేదిక కానున్నది. కాగా, ఈప్లూటో, ఈప్లూటో 7జీ అనే రెండు వేరియంట్లలో ఈ మోడల్ బైక్‌లు పరిచయం అవుతున్నాయి. నిజానికి ప్యూర్ ఈవీ.. బ్యాటరీల తయారీ సంస్థ అయినా ఐఐటీ హైదరాబాద్ సహకారంతో రూ.350 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయడానికి ముందుకొచ్చింది. 

దేశంలోని మధ్యతరగతి వినియోగదారులే లక్ష్యంగా అందుబాటు ధరకే వీటిని అందించాలని సంస్థ భావిస్తున్నది. ఏటా దాదాపు 2000 స్కూటర్లు తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, డిమాండ్‌నుబట్టి ఇంకా పెంచుతామని అంటున్నారు. 

also read అదరగొడుతున్న పియాజియో రెండు కొత్త స్కూటర్లు...

ఈ ప్రారంభ కార్యక్రమానికి నీతి అయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సరస్వత్, డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ సతీశ్‌రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్‌ హాజరు కానున్నారు. ప్యూర్ ఎనర్జీ, ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ బైక్ తయారు చేశాయి. ఇగ్నైట్, ఎట్రన్స్, ఇప్లూటో, ఎట్రోన్ మోడళ్లలో అందుబాటులోకి రానున్నాయి. 
 

click me!