వచ్చేసింది బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్... ధర ఎంతంటే...?

By Sandra Ashok Kumar  |  First Published Jan 14, 2020, 3:47 PM IST

 ద్విచక్ర  వాహన తయారీదారి బజాజ్ కంపెనీ మొట్టమొదటి సరికొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. బజాజ్ ప్రో-బైకింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా దీనిని విక్రయిస్తుంది.


బజాజ్ ఆటో లిమిటెడ్ సంస్థ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త బజాజ్ చేతక్ ను విడుదల చేసింది. దీని ధర 1 లక్షల నుండి మొదలవుతుంది. ఇది రెండు వేరియంట్లలో లభ్యంకానుంది.

డ్రమ్ బ్రేక్‌లతో కూడిన చేటక్ అర్బన్ ఎడిషన్ ధర1 లక్ష, డిస్క్ బ్రేక్‌లతో కూడిన చేతక్ ప్రీమియం ఎడిషన్ ధర 1.15 లక్షలు. అర్బన్ ఎడిషన్ సాలిడ్ కలర్స్,  గ్లాసి ఫినిష్ తో మెటాలిక్ పెయింట్, కాస్మెటిక్ మార్పులతో వస్తుంది. ప్రీమియం వేరియంట్ ఇతర  మార్పులతో పాటు మెటాలిక్ పెయింట్‌ను కలిగి ఉంది. చేతక్ ఆరు వేర్వేరు కలర్లలో లభిస్తుంది. ఇంకా దీని బుకింగ్స్ 15 జనవరి  2020 నుండి మొదలవుతాయి. అయితే  2,000 చెల్లించాల్సి వస్తుంది.

Latest Videos

undefined

also read మారుతి సుజుకీ కారుకి ‘ఇండియన్లు’ ఫిదా... అందరికీ నచ్చేలా డిజైన్..

"దీని ఐకానిక్ డిజైన్, ఫీచర్స్ రోజు కొత్త అనుభవం ఇస్తాయి "అని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ అన్నారు.

కొత్త చేటక్ మొత్తం మెటల్ బాడీతో, నియో రెట్రో డిజైన్‌తో, విలక్షణమైన సిల్హౌట్‌తో వస్తుంది. ఇది వెస్పా ద్వారా ఇన్స్పైర్ చేయబడింది. చేతక్ 120 కిలోల బరువు ఉంటుంది. దీని గరిష్ట వేగం 60 కి.మీ. ప్రీమియం పెయింట్ ఫినిష్, అల్లాయ్ వీల్స్, బ్యాటరీ రేంజ్, రియల్ టైమ్ బ్యాటరీ ఇండికేటర్, అలాగే కీలెస్ ఇగ్నిషన్ వంటి సమాచారాన్ని అందించే విధంగా పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో కొత్త బజాజ్ చేతక్ ఎల్‌ఈడీ లైటింగ్‌ ఉన్నాయి.


మహారాష్ట్రలోని పూణే  దగ్గర చకన్ లో బజాజ్ ఆటో తయారీ కేంద్రంలో బజాజ్ చేతక్ స్కూటర్లను నిర్మిస్తున్నారు. చేతక్ స్కూటర్ 3 సంవత్సరాలు / 50,000 కిమీ స్టాండర్డ్ వారంటీ కూడా ఉంది. చేటక్ ఎలక్ట్రిక్ మోటారు 4 kW (5.36 bhp) గరిష్ట శక్తిని, 3.8 kW (5 bhp) నిరంతర శక్తిని, 16 Nm టార్క్ను అందిస్తుంది. చేతక్ స్కూటర్లో రెండు ఆపరేషన్ మోడ్స్ ఉంటాయి - ఎకో ఇంకా స్పోర్ట్. ఎకో మోడ్‌లో ఒక ఫుల్ ఛార్జీపై  చేతక్ గరిష్టంగా 95 కి.మీ కంటే ఎక్కువ నడుస్తుంది, స్పోర్ట్ మోడ్‌లో ఒకే ఛార్జీపై  85 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.

also read కియా మోటర్స్.. ముందు హ్యుండాయ్.. విలవిల... ధర పెంచినా ఫుల్ డిమాండ్

బజాజ్ కంపెనీ ప్రకారం బ్యాటరీ లైఫ్ 70వేల కి.మీ. వరకు సహకరిస్తుంది. వివిధ వాతావరణ పరిస్థితులు, రహదారులపైనా దీనిని పరీక్షించారు. ఐదు గంటల్లో బ్యాటరీని 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.అంటే ఒక గంటలో 25 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు, కాని ఫాస్ట్ ఛార్జర్‌ ఫీచర్ దీనికి లేదు. కొత్త చేటక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 12 అంగుళాల వీల్స్, సింగిల్ సైడెడ్ ట్రైల్ లింక్ ఫ్రంట్ సస్పెన్షన్, సింగిల్ షాక్ రియర్ సస్పెన్షన్ పై దీనికి ఉంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొదట్లో పూణేలో లభిస్తుంది. తరువాత బెంగళూరు ఆ తరువాత దేశంలోని ఇతర ప్రాంతాలలో లభిస్తాయి. డెలివరీలు ఫిబ్రవరి 2020 నుండి ప్రారంభమవుతాయి.

click me!