విపణిలోకి 3 ప్రీమియం హీరో ‘బైక్’లు: ధర రూ. 94వేల నుంచి మొదలు

By rajashekhar garrepallyFirst Published May 2, 2019, 1:39 PM IST
Highlights

దేశీయ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల తయారీ సంస్థ ‘హీరో మోటో కార్ప్స్’ విపణిలోకి మూడు ప్రీమియం బైక్‌లను ఆవిష్కరించింది. ఈ బైక్‌ల ధరలు రూ.94 వేల నుంచి మొదలవుతాయి. 
 

న్యూఢిల్లీ: దేశీయ అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్‌ మూడు కొత్త బైక్‌లను విపణిలోకి ఆవిష్కరించింది. ప్రీమియం ద్విచక్ర వాహనాల విభాగంలో రూపుదిద్దుకున్న ఈ బైక్‌లను హీరో మోటోకార్ప్ తయారు చేసింది. వీటి ధర రూ.94 వేల నుంచి ప్రారంభమై రూ.1.05 లక్షల శ్రేణిలో అందుబాటులోకి తెచ్చింది.

వీటిలో 200సీసీ సామర్థ్యం గల ఎక్స్‌ పల్స్‌ 200టీ ధర రూ.94 వేలు. ఎక్స్‌ ప్లస్‌ 200 ధర రూ.97 వేలు కాగా, ఇదే బైక్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ మోడల్‌ రూ.1.05 లక్షలుగా ఉంది. ఇక ఎక్స్‌ట్రీమ్‌ 200ఎస్‌ ధర రూ.98,500. 

ఈ మూడు బైక్‌ల ఆవిష్కరణతో హీరో మోటోకార్ప్‌ ఎక్స్‌ సిరీస్‌లో ఇప్పటివరకూ నాలుగు మోడల్స్‌ విడుదల చేసినట్లయింది. ఈ బైక్‌లు బుక్‌ చేసుకొనేందుకు త్వరలోనే అవకాశం కల్పిస్తామని హీరో మోటో కార్ప్స్ తెలిపింది.  

ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్‌ సేల్స్‌ విభాగం చీఫ్‌ సంజయ్‌ భాన్‌ మాట్లాడుతూ ‘ప్రీమియం బైక్‌ సెగ్మెంట్‌లో మా ఉనికిని నెమ్మదిగా పెంచుతున్నాం. ఇది దీర్ఘకాలిక ప్రణాళిక. రాబోయే మూడు, నాలుగేళ్లలో ప్రీమియం బైక్‌ల సెగ్మెంట్‌లో మొదటి స్థానం లేదా దానికి చేరువలో ఉండే లక్ష్యంతో పని చేస్తున్నాం’ అని అన్నారు. 

400 నుంచి 450 సీసీ బైక్‌ల సెగ్మెంట్‌లోనూ హీరో తన ముద్ర వేసే యోచనలో ఉందని, ఈ విభాగంలో బైక్‌లను ప్రవేశపెడతామని హీరో మోటోకార్ప్‌ సేల్స్‌ విభాగం చీఫ్‌ సంజయ్‌ భాన్‌ తెలిపారు. ప్రారంభ ధర స్థాయి బైక్‌ల నుంచి 150 సీసీ లోపు బైక్‌ల సెగ్మెంట్‌లో ప్రస్తుతం హీరో మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

విపణిలోకి మూడు ప్రీమియం మోటార్ బైక్‌లను ఆవిష్కరించిన సందర్భంగా హీరో మోటో కార్స్స్ చైర్మన్ పవన్ ముంజాల్ మాట్లాడుతూ తమ కస్టమర్ పునాది ఆసియా, ఆఫ్రికా, దక్షిణ, సెంట్రల్ అమెరికా ఖండాల్లో విస్తరించి ఉన్నదన్నారు. టెక్నాలజికల్‌గా హీరో మోటో కార్ప్ ఇక ‘ప్రీమియం’ బైక్‌ల తయారీ దిశగా ప్రయాణిస్తుందన్నారు. 

కాగా 150 సీసీ  బైక్‌ల సెగ్మెంట్‌లో  మొదటి స్థానంలో ఉన్న  హీరో మోటో2017, 2018 ఈఐసీఎంఏషోలో  200 సీసీ  విభాగంలో ఎక్స్‌పల్స్ 200, ఎక్స్‌పల్స్ 200టీ బైక్స్‌ను  పరిచేయం చేసిన సంగతి తెలిసిందే.

click me!