గతంలో.. కచ్చా బాదం , మయకిరియే లాంటి పాటలకు స్టెప్పులు వేసి అభిమానులను ఆకట్టుకున్న ఆమె తాజాగా మరో వైరల్ సాంగ్ కి స్టెప్పులు వేసి ఆకట్టుుకోవడం విశేషం. రెండు పాటల రీమిక్స్ పాటకు.. ఆమె స్టెప్పులు వేశారు.
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. కి పరిచయం అక్కర్లేదు. ఈ పేరు మన దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాలకు సుపరిచితమే. ఆమె పేరు ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. ఆమె రాకెట్ చేత పట్టి.. విజృంభించింది అంటే.. ప్రత్యర్థికి చెమటలు పట్టాల్సిందే. ఆమె బాడ్మింటన్ ఆటకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె ఇప్పటికే రెండు సార్లు ఒలంపిక్స్ పతక విజేతగా నిలిచారు. ఒకసారి రజతం, మరోసారి కాంస్యం ఆమె గెలుచుకొని దేశ గౌరవాన్ని పెంచారు. అయితే.. పీవీ సింధు కేవలం బ్యాడ్మింటన్ కి మాత్రమే పరిమితం కాలేదు. ఆమెలో ఇతర టాలెంట్స్ కూడా చాలానే ఉన్నాయి. అందులో డ్యాన్స్ కూడా ఒకటి.
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే పీవీ సింధు.. ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉంటారు. గతంలో.. కచ్చా బాదం , మయకిరియే లాంటి పాటలకు స్టెప్పులు వేసి అభిమానులను ఆకట్టుకున్న ఆమె తాజాగా మరో వైరల్ సాంగ్ కి స్టెప్పులు వేసి ఆకట్టుుకోవడం విశేషం. రెండు పాటల రీమిక్స్ పాటకు.. ఆమె స్టెప్పులు వేశారు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో ఇప్పటికే ఈ పాట ఇప్పుడు వైరల్ గా మారగా.. దానికి.. సింధు కూడా స్టెప్పులు వేయడం విశేషం.
undefined
‘హెడ్స్ షోల్డర్స్, నీస్ అండ్ టోస్’, ‘గమీ గమీ’ ఈ రెండు పాటల కాంబినేషన్ గా చేసిన రీమిక్స్ పాటకు ఆమె డ్యాన్స్ చేశారు. దానిని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి... మీకు ఏది సంతోషాన్ని ఇస్తే అదే చేయండి అంటూ క్యాప్షన్ జోడించడం గమనార్హం. సింధు షేర్ చేసిన ఈ పోస్టుకి వేలల్లో లైకులు, వందల్లో కామెంట్స్ రావడం గమనార్హం. సింధూ.. ఆల్ రౌండర్ అంటూ అందరూ కామెంట్స్ చేయడం విశేషం.
సింధూ తన ఆటతో.. దేశానికి గౌరవాన్ని మరింత పెంచుతున్నారని.. ఆమె ఆల్ రౌండర్ అంటూ... ఓ నెటిజన్ కామెంట్ రూపంలో అభిమానాన్ని పంచుకోవడం విశేషం.మరొకరేమో ... సింధుకి హ్యాట్సాప్ తెలియజేశారు. సింధు చాలా అందంగా ఉన్నావంటూ కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా, స్పోర్ట్స్ ఫ్రంట్‌లో పీవీ సింధూ.. మలేషియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో చైనీస్ తైపీకి చెందిన తాయ్ ట్జు యింగ్ చేతిలో ఓడిపోయింది.