Malaysia Open: సింధు, ప్రణయ్ లకు షాక్.. మలేషియా ఓపెన్ లో ముగిసిన భారత్ పోరు..

Published : Jul 01, 2022, 09:53 PM IST
Malaysia Open: సింధు, ప్రణయ్ లకు షాక్.. మలేషియా ఓపెన్ లో ముగిసిన భారత్ పోరు..

సారాంశం

PV Sindhu - HS Prannoy: కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేషియా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 750 టోర్నీలో భారత జట్టు ప్రయాణం ముగిసింది. స్టార్ ప్లేయర్లు సింధు, ప్రణయ్ లు క్వార్టర్స్ లోనే నిష్క్రమించారు.   

మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేషియా  ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో దేశం ఆశలు పెట్టుకున్న ఇద్దరు సూపర్ స్టార్లు విఫలమయ్యారు. డబుల్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ పీవీ సింధుతో పాటు హెచ్ ఎస్ ప్రణయ్ కూడా ఈ టోర్నీలో క్వార్టర్స్ లోనే ఇంటిబాట పట్టారు. దీంతో ఈ టోర్నీలో భారత్ ప్రయాణం కూడా ముగిసింది. 

శుక్రవారం జరిగిన  మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ లో సింధు.. సెకండ్ సీడ్ క్రీడాకారిణి టై జు యింగ్ (చైనీస్ తైఫీ) చేతిలో ఓడింది.  53 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో ఆమె 13-21, 21-15, 21-13 తేడాత సింధూను ఓడించింది.  

ఈ స్టార్ ఇండియన్ షట్లర్ తొలి సెట్ (21-13) ను నెగ్గినా  కానీ మిగతా రెండింట్లో అదే ఆటను కొనసాగించలేకపోయింది. గతేడాది టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ సెమీస్ ఫైనల్స్ ఓటమి తర్వాత టై జు చేతిలో సింధుకు ఇది వరుసగా ఆరో ఓటమి. మొత్తంగా 21 మ్యాచులలో 16వ ఓటమి కావడం గమనార్హం. 

 

ఇక పురుషుల సింగిల్స్ లో ప్రపంచ 21వ నెంబర్ ఆటగాడు ప్రణయ్.. 18-21, 16-21 తేడాతో ఎనిమిదో సీడ్ ఆటగాడు జొనాతన్ క్రిస్టీ చేతిలో ఓడాడు.   ఈ ఇద్దరూ  నిష్క్రమించడంతో ఈ టోర్నీలో భారత ఆశలు అడియాసలయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

అమ్మతనానికి ఆదర్శం.. 30 లీటర్ల చనుబాలు దానం చేసిన గుత్తా జ్వాల
Saina Kashyap: కశ్యప్ తో విడాకులు.. ట్విస్ట్‌ ఇచ్చిన సైనా నెహ్వాల్‌