కారు ఇంజిన్ వేడెక్కడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటి కారణం అధిక ఉష్ణోగ్రతలో కారు నడపడం. అంటే, అత్యంత వేడి వాతావరణంలో కారు నడుపుతున్నట్లయితే సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే కారు ఇంజన్ వేగంగా వేడెక్కుతుంది.
కారు ఎక్కువసేపు నడపాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి హిటింగ్ సమస్యతో సహా. ఎందుకంటే మీరు మీ కారును జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ ఎప్పుడైనా ఓవర్ హీట్ అయితే గుర్తుంచుకోవలసిన విషయాలు ఉన్నాయి.
రెండు ముఖ్య కారణాలు
కారు ఇంజిన్ వేడెక్కడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటి కారణం అధిక ఉష్ణోగ్రతలో కారు నడపడం. అంటే, అత్యంత వేడి వాతావరణంలో కారు నడుపుతున్నట్లయితే సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే కారు ఇంజన్ వేగంగా వేడెక్కుతుంది. దీనితో పాటు కారును ఎక్కువ సేపు కంటిన్యూస్‌గా నడిపితే వేడెక్కడం మరో కారణం.
undefined
వేడెక్కినప్పుడు ఏమి చేయాలి
పైన పేర్కొన్న రెండు కారణాల వల్ల మీ కారు వేడెక్కినట్లయితే, ముందుగా కారును సురక్షితమైన ప్రదేశంలో ఆపండి. కారును ఆపిన తర్వాత, దాదాపు అరగంట పాటు ఇంజన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఇంజిన్ చల్లగా ఉన్నప్పుడు సరైన ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. దీని కోసం మీరు రోడ్డు పక్కన ఏదైనా ప్రదేశాలలో అపవచ్చు
రేడియేటర్ క్యాప్
నడుస్తున్న కారులో రేడియేటర్ క్యాప్ ఎప్పుడూ తీసివేయవద్దు. ఎందుకంటే ఇంజిన్‌ను చల్లగా ఉంచడం రేడియేటర్ పని. ఇంజిన్‌ను చల్లబరచడానికి రేడియేటర్‌లో కులెంట్ వాడుతుంటాం. రేడియేటర్ క్యాప్ తెరవడానికి ప్రయత్నించినట్లయితే దానిలో చాలా ప్రేజర్ ఉంటుంది ఇంకా క్యాప్ తీసేటప్పుడు చాలా వేగంగా కులెంట్ బయటకు వస్తుంది. ఇది మీ చేతులు సహా శరీర భాగాలపై పడితే మండే అనుభూతిని కలిగిస్తుంది. మీరు దీన్ని తెరవాలనుకుంటే, మొదట కారుని కొంత సమయం పాటు ఆఫ్ చేసి, ఇంజిన్ చల్లబడిన తర్వాత మాత్రమే దాన్ని ఓపెన్ చేసి చెక్ చేయండి.
కులెంట్ లీక్
కారులోని అన్ని భాగాలు సరిగ్గా చేస్తూ కారులో కూలెంట్ ఉంటే కారు ఓవర్ హీట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ అయిన కూడా వేడెక్కితే కారు కూలెంట్ ఎక్కడి నుండైనా లీక్ అవుతుందో చెక్ చేయాలి. లీక్ సంభవించినప్పుడు, కులెంట్ నెమ్మదిగా తగ్గుతుంది ఇంకా ఇంజిన్ వేడెక్కుతుంది.
ఇతర రకాల లీకేజీలను కూడా జాగ్రత్తగా చూసుకోండి
కారులో కూలెంట్ ఉండి, ఎక్కడి నుండైనా లీకేజీ లేకపోయిన కారు వేడెక్కుతున్నట్లయితే కారులో వేరే రకమైన లీకేజీ ఉండే అవకాశం ఉంది. రేడియేటర్ లేదా ఇంజన్ నుండి ఏదైనా లీకేజీ జరుగుతుంటే కారు బానెట్‌ని తెరిచి చూడండి, అలాగే కారు ఇంజిన్ కింద నుండి చెక్ చేయండి. ఏదైనా లీకేజీ జరిగితే, వీలైనంత త్వరగా కారుని మంచి మెకానిక్ వద్దకు తీసుకెళ్లి క్షుణ్ణంగా తనిఖీ చేయండి.