ఆన్‌లైన్‌లో ఫాస్ట్‌ట్యాగ్‌ని ఎలా కోనాలి ఇంకా ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే..?

By asianet news telugu  |  First Published Dec 31, 2022, 1:59 PM IST

టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు దీనిని భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసింది. టోల్ ప్లాజాల ద్వారా ప్రయాణించే అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చాలి.  


భారతదేశంలోని అన్ని నాలుగు చక్రాల వాహనాలకు, ప్రత్యేకించి టోల్ ప్లాజాలతో హైవేలపై తిరిగే వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి అయింది. ఫాస్ట్‌ట్యాగ్ అనేది ప్రీపెయిడ్ రీఛార్జ్ కార్డ్, దీనిని వాహనం విండ్‌షీల్డ్‌పై మాగ్నెటిక్ స్ట్రిప్‌తో కూడిన స్టిక్కర్ రూపంలో అతికించబడుతుంది. ఇంకా రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ (RFID)తో అమర్చబడి ఉంటుంది, దీనిని టోల్ ప్లాజాలోని సిస్టమ్‌ ఆటోమేటిక్‌గా గుర్తించి ఫాస్ట్‌ట్యాగ్‌ని స్కాన్ చేయడానికి ఇంకా స్టిక్కర్‌కి లింక్ చేయబడిన వాహన యజమాని అక్కౌంట్ నుండి టోల్ చార్జ్ వసూల్ చేస్తుంది. దీని ఉపయోగం ఏంటంటే హైవేలపై టోల్ ప్లాజాల వద్ద పేమెంట్ ఎలక్ట్రానిక్ మోడ్ గా టోల్ బూత్‌ల వద్ద ఆగకుండా క్రాస్ చేయడానికి సహాయపడుతుంది.

టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు దీనిని భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసింది. టోల్ ప్లాజాల ద్వారా ప్రయాణించే అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చాలి. మీరు ఫాస్ట్‌ట్యాగ్‌ని సులభంగా  ఎలా కోనాలో  ఇంకా ఆన్‌లైన్‌లో ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చో  తెలుసుకోండి..

Latest Videos

ఫాస్ట్‌ట్యాగ్‌ని ఏదైనా ఆన్‌లైన్ రిటైలర్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ ఇంకా ప్రైవేట్ బ్యాంకులు ఫాస్ట్‌ట్యాగ్‌ని ఆందిస్తున్నాయి. మీరు వాటి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా వారి మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లు సాధారణంగా FASTagని కొనుగోలు చేయడానికి ఇంకా ఆక్టివేట్ చేయడానికి ఆప్షన్ చూపిస్తాయి, అయితే కొన్ని మొబైల్ అప్లికేషన్‌లలో కూడా ఈ ఆప్షన్ ఉంటుంది.

FASTagని కొనుగోలు చేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌లో My FASTag అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. My FASTag అప్లికేషన్‌లో, 'Activate NHAI FASTag' ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీరు ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేసిన వెబ్‌సైట్‌ను సెలెక్ట్ చేసుకొని IDని ఎంటర్ చేయండి లేదా దాన్ని ఆక్టివేట్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి. ఆ తర్వాత, వాహనం రకం, రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలతోపాటు మీ వాహనం వివరాలను ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకొండి. ఇప్పుడు, మీ బ్యాంక్ అక్కౌంట్ లింక్ చేయండి లేదా మీరు ఫాస్ట్‌ట్యాగ్ అక్కౌంట్ రీఛార్జ్ చేయాలనుకుంటున్న ప్రీపెయిడ్ వాలెట్‌ని సెలెక్ట్ చేసుకోండీ అండ్ టోల్ చార్జ్ చెల్లించండి. 

ఫాస్ట్‌ట్యాగ్‌ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ఇంకా ఆక్టివేట్ చేయడం ఎలా

స్టెప్ 1 :
ఏదైనా ఆన్‌లైన్ రిటైలర్ నుండి ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయండి

స్టెప్ 2 :
మీ మొబైల్‌లో 'మై ఫాస్ట్‌ట్యాగ్' అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

స్టెప్ 3 :
'యాక్టివేట్ ఎన్‌హెచ్‌ఏఐ ఫాస్ట్‌ట్యాగ్' ఆప్షన్ పై క్లిక్ చేయండి 

స్టెప్ 4 :
ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయడానికి వెబ్‌సైట్‌ని ఎంచుకోండి

స్టెప్ 5 :
ఫాస్ట్‌ట్యాగ్ IDని ఎంటర్ చేయండి లేదా దాన్ని ఆక్టివేట్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి

స్టెప్ 6 :
మీ వాహన వివరాలను ఎంటర్ చేయండి

స్టెప్ 7 :
మీ బ్యాంక్ అక్కౌంట్ లింక్ చేయండి లేదా ప్రీపెయిడ్ వాలెట్‌ని సెలెక్ట్ చేసుకొండి

click me!