ఇండియాలో వోక్స్ వేగన్ కొత్త ఎస్‌యూ‌వి కార్ లాంచ్... ధర ఎంతంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Mar 6, 2020, 3:10 PM IST

వోక్స్ వేగన్ టిగువాన్ ఆల్-స్పేస్ కారు పెట్రోల్ ఇంజన్ వేరిఎంట్ మాత్రమే లాంచ్ చేశారు. కాబట్టి ఈ మోడల్ టర్బో చార్జ్డ్ 2-లీటర్ టిఎస్ఐ ఇంజన్ ద్వారా పనిచేస్తుంది.
 


ప్రముఖ కార్ల తయారీదారి వోక్స్ వేగన్ ఇండియా 2020లో ఇప్పుడు ఒక కొత్త మోడల్ కారును లాంచ్ చేసింది. ఇప్పుడు  ఇది ఎస్‌యూవీ కార్లు కలిగిన  బ్రాండ్‌గా మారింది.

వోక్స్ వేగన్ ఇండియా ఈ రోజు టిగువాన్ అల్ స్పేస్ ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రారంభపు ధర రూ.33.12 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కారులో 5 సీట్ల కంటే  ఎక్కువగా అంటే 7 సీట్లతో స్టాండర్డ్ గా  అందిస్తున్నారు.

Latest Videos

also read వచ్చేనెలలో విపణిలోకి హోండా ‘డబ్ల్యూఆర్-వీ’.. సరికొత్త ఫీచర్లతో..

ఇది హోండా సిఆర్-వి, టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్, మహీంద్రా అల్టురాస్ జి4 లతో పోటీపడుతుంది.వోక్స్ వేగన్ టిగువాన్ ఆల్-స్పేస్ పెట్రోల్ వెర్షన్ మాత్రమే లాంచ్ చేశారు. కాబట్టి ఈ మోడల్ టర్బో చార్జ్డ్ 2-లీటర్ టిఎస్ఐ ఇంజన్ ద్వారా 187 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఇది 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌ స్టాండర్డ్ గా వస్తుంది. వోక్స్ వేగన్ ఎస్‌యూవీ కోసం 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది.చూడటానికి వోక్స్ వేగన్ టిగువాన్ ఆల్స్పేస్ కారు 5-సీట్ల మోడల్ లాగా డిజైన్ ఇంకా స్టైలింగ్ తో వస్తుంది.

టిగువాన్‌ కార్ బాడీ కలర్ రంగుకు బదులుగా నలుపు రంగులో స్పాయిలర్ వెనుక వైపు ఉండగా, అండర్‌బాడీ క్లాడింగ్, డ్యుయల్ ఎగ్జాస్ట్ పోర్ట్‌లకు మరింతగా మెరిసే బ్యాక్ బంపర్ ఉన్నాయి. ఎస్‌యూవీలో స్పోర్టియర్ ఫ్రంట్ బంపర్, ట్వీక్డ్ గ్రిల్, కొత్త ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

also read  ‘ఎక్స్1’ పేరుతో విపణిలోకి బీఎండబ్ల్యూ కొత్త కారు.. ధరెంతంటే?

వీటితో పాటు కొత్త డ్యూయల్-టోన్ 17-అంగుళాల వీల్స్ కూడా ఉన్నాయి. కారు  క్యాబిన్ చాలా విశాలమైనది. దీనికి పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా ఉంది. టిగువాన్ ఆల్ స్పేస్ కారు కీలెస్ ఎంట్రీని పొందుతుంది.

కారులోపల లెథర్ సీట్లు మంచి కంఫర్ట్ ఇస్తాయి. టిగువాన్ ఆల్ స్పేస్ 3-జోన్ క్లైమాట్రానిక్ ఎసితో వస్తుంది. ఇది డ్రైవర్, ముందు, వెనుక సీట్లలోని ప్రయాణీకులకు తగిన ఉష్ణోగ్రతని ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.

సేఫ్టీ ఫ్రంట్‌లో టిగువాన్ ఆల్‌స్పేస్‌లో ఎబిఎస్, ఇబిడి, ఇఎస్‌పి, 7 ఎయిర్‌బ్యాగులు, టైర్ మానిటరింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి; ఇవన్నీ స్టాండర్డ్ గా వస్తునాయి.
 

click me!