హార్లీ డేవిడ్సన్ ఫ్యాబ్ బోబ్ ‘మిల్ వైకీ-ఎయిర్ 107 వీ- ట్విన్’ ఇంజిన్ కలిగి ఉంటుంది. దీని ధర రూ.14.69 లక్షలు పలుకుతుంది.
ముంబై: దేశమంతా అక్టోబర్ 29వ తేదీన ‘భాయి దూజ్’ జరుపుకున్నది. ఈ పండుగ రోజు ఆడబడుచులు ప్రత్యేక పూజలు చేస్తారు. తమ సోదరులకు తమ ప్రేమానురాగాలకు గుర్తుగా బహుమతులు అందజేస్తారు. అందులో భాగంగా బాలీవుడ్ కథా నాయిక కం మోడల్ ఊర్వశి రౌతెలా ఈ పండుగ సందర్భంగా తన తమ్ముడికి జీవిత కాలం గుర్తుండిపోయే విలువైన బహుమతిని ప్రదానం చేసింది.
తమ్ముడు యష్ రాజ్ రౌతేలాకు ఈ భాయ్ దూజ్ సందర్భంగా క్రూయిజర్ మోటార్ సైకిల్ ‘హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బోబ్’ కొని బహుమతిగా అందజేశారు. ఈ మేరకు ఊర్వశి రౌతెలా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక వీడియో క్లిప్ పోస్ట్ చేశారు.
హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బోబ్ మోడల్ బైక్‌పై తన సోదరుడు యశ్ రాజ్ తో కలిసి రైడ్ చేస్తున్న ద్రుశ్యంగల వీడియోను పోస్ట్ పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ‘హాపీ దీపావళి @ హార్లీ డేవిడ్సన్ మోటారు సైకిలును నా తమ్ముడు యశ్‌రాజ్ రౌతేలాకు అందజేశా’ అని పేర్కొన్నారు.
also read మారుతి & టాటా ధగధగ.. మిగతా సంస్థలు దిగదిగ
2017లో విపణిలో ప్రవేశపెట్టిన హార్లీ డేవిడ్సన్ మిల్ వౌకీ ఎయిట్ 107 వీ ట్విన్ ఇంజిన్‌తో కలిసిన ఫ్యాట్ బోబ్ మోటారు సైకిల్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. యునిక్యు డిజైన్ ఫీచర్లతోపాటు బైక్ ఫ్లాంట్స్‌తో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ అమర్చారు. ఈ బైక్ ఫాట్ బోబ్ 309 కిలోలు ఉన్నా స్టిఫర్‌గా, పాత తరం మోడల్ హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బోబ్ బైక్ కంటే తేలిగ్గా ఉంటుంది. దీని ధర రూ.14.69 లక్షలుగా నిర్ణయించారు.
2013లో బాలీవుడ్‌లో సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో ఆరంగ్రేటం చేశారు. 2015 మిస్ యూనివర్స్‌గా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. తన తమ్ముడి యశ్ రాజ్ రౌతేలాకు బహుమతి ఇవ్వడంపై ఆమె స్పందిస్తూ ‘నా తమ్ముడికి ప్రపంచంలోనే ఉత్తమ సోదరి ఉంది. వాస్తవంగా ఏడాదికొక సారి మేం కలుస్తాం. ఈ భాయిదూజ్ పండుగకు నేను మిస్సవుతున్నా’ అని పేర్కొన్నారు.
also read మరో మైలురాయి: 2.5 కోట్లకు హీరో మోటోకార్ప్ సేల్స్
పోర్చుగల్‌లో పైలట్‌గా జీవిస్తున్న యశ్ రాజ్ రౌతేలాను సర్ ప్రైజ్ చేసేందుకు ఈ బహుమతి అందజేశానని, ఇది చూసి అతడి కళ్లు మెరుస్తాయని చెప్పారు. భాయ్ దూజ్ సందర్భంగా బహుమతులు ఇవ్వడం మాత్రమే కాదని, విలువైన సమయం, ప్రేమానురాగాలు పంచుకోవడం కూడా ముఖ్యమేనన్నారు.
ప్రతియేటా ఈ రోజు కోసం తాను వేచి ఉండేదానని, కానీ బహుమతులతో స్పాయిల్ చేసే దాన్నని ఊర్వశి రౌతెలా చెప్పారు. కొన్ని వారాల క్రితం మరో నటుడు రాజ్ కుమార్ రావు.. హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బోబ్ బైక్ కొనుగోలు చేశారు.