ట్రైబర్‌కు జోడీ: సబ్ కంపాక్ట్ సెడాన్ తయారీలో రెనాల్ట్

By Sandra Ashok Kumar  |  First Published Nov 1, 2019, 2:18 PM IST

భారతీయుల్లో అత్యధికులు సబ్ కంపాక్ట్ సెడాన్ మోడల్ కార్లతో కూడిన ఓలా, ఉబెర్ క్యాబ్‌ల్లో ప్రయాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆఫ్రికా ఖండ దేశాలతోపాటు లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లో వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది.  


న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్డ్ ఇటీవల భారతదేశ వినియోగదారులకు మోస్ట్ అఫార్డబుల్ మల్టీ పర్పస్ వెహికల్ (ఎంవీపీ) టైబర్‌ను విడుదల చేసి విజయం సాధించింది. దీని స్ఫూర్తితో అదే చౌక ధరకు సబ్ కంపాక్ట్ సెడాన్ మోడల్ కారును ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు చేసింది.

రెనాల్ట్ విడుదల చేయ సంకల్పించిన సబ్ కంపాక్ట్ సెడాన్ మోడల్ కారు.. మారుతి సుజుకి డిజైర్ కారుతో తలపడనున్నదని భావిస్తున్నారు. భారతదేశంలోనే తయారుచేయనున్న ఈ కారును ఇక్కడ నుంచే విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయాలని తలపోస్తున్నది రెనాల్ట్. 

Latest Videos

also read  మరో మైలురాయి: 2.5 కోట్లకు హీరో మోటోకార్ప్‌ సేల్స్

భారతదేశంలో రూపొందించి ఉత్పత్తి చేసే సబ్ కంపాక్ట్ సెడాన్ మోడల్ కార్లకు లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లో మంచి ఆదరణ ఉన్నది. ఆఫ్రికా ఖండ దేశాలు కూడా సబ్ కంపాక్ట్ సెడాన్ మోడల్ కార్లకు అత్యంత ముఖ్యమైన మార్కెట్‌గా నిలిచాయి. ఆఫ్రికా ఖండాల్లో ఆటోమొబైల్ రంగం పూర్తిగా సబ్ కంపాక్ట్ సెడాన్ మోడళ్లదే ఆధిపత్యం. 

డాసియా లొగాన్ ఆధారంగా రెనాల్ట్ బీ0/ఎం0 వేదికగా సరికొత్త కారును రూపొందించనున్నది. సీఎంఎఫ్-ఏ ప్లస్ ప్లాట్ ఫామ్ మీద ట్రైబర్ ఎంవీపీకి సరిపోలిన కారును తీసుకు రానున్నది. ట్రైబర్ కారును డ్రైవరబిలిటీ, స్పేస్ మేనేజ్మెంట్ అభివ్రుద్ధి చేయనున్నది రెనాల్ట్.

also read  హ్యుందాయ్ ఐ20 కొత్త మోడల్....ధర ఎంతో తెలుసా?

అత్యధిక మంది ప్రజలు ఓలా, ఉబర్ వంటి క్యాబ్‌ల్లో ప్రయాణించడానికి ప్రాధాన్యం ఇస్తున్నందునే సబ్ కంపాక్ట్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. మారుతి సుజుకి డిజైర్, హ్యుండాయ్ ఎక్స్‌సెంట్, హోండా అమేజ్, ఫోర్డ్ అస్పైర్, టాటా టైగొర్, వోక్స్ వ్యాగన్ అమియో వంటి కార్లు సబ్ కంపాక్ట్ మోడల్‌లో అందుబాటులో ఉంది. 
 

click me!