మారుతి & టాటా ధగధగ.. మిగతా సంస్థలు దిగదిగ

By Sandra Ashok Kumar  |  First Published Nov 2, 2019, 12:01 PM IST

ఫెస్టివ్ సీజన్‌లో ఆటోమొబైల్ సంస్థలకు కాసింత ఊరట లభించింది. 2018తో పోలిస్తే, 2019 అక్టోబర్ నెలల్లో మారుతి సుజుకి, హోండా కార్స్, టాటా మోటార్స్ సేల్స్ పెరిగాయి. మిగతా సంస్థల సేల్స్ గత అక్టోబర్ నెలలో పడిపోయాయి.


న్యూఢిల్లీ: పండుగల సీజన్‌లో వాహన అమ్మకాలను పెంచుకోవడానికి ఆటోమొబైల్ చేసిన విశ్వ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ పండుగ సీజన్‌పై గంపెడాశ పెట్టుకున్న అన్ని వాహన తయారీ సంస్థలకు కొనుగోలుదారులు గట్టి షాకిచ్చారు. కొన్ని కంపెనీల కార్ల అమ్మకాలు పెరిగితే.. మరికొన్ని సంస్థల విక్రయాలు భారీగా తగ్గక పోవడమే కాసింత ఊరట.

గత ఏడు నెలలుగా అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మారుతి సుజుకీకి మాత్రం కాస్త ఊరట లభించింది. గత నెలలో కంపెనీ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 4.5 శాతం పెరిగి 1,44,277లకు చేరుకున్నాయి. గతేడాది అక్టోబర్ నెలలో 1,38,100 కార్లు మాత్రమే విక్రయించింది.

Latest Videos

undefined

ఈ సందర్భంగా మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ అమ్మకాలను పెంచుకోవడానికి కంపెనీ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చాయని, ముఖ్యంగా ధరలు తగ్గించడం, కొనుగోలుదారులకు ఆర్థిక సేవలు అందించడం ఇందుకు దోహదం చేశాయన్నారు. 

also read ట్రైబర్‌కు జోడీ: సబ్ కంపాక్ట్ సెడాన్ తయారీలో రెనాల్ట్

వీటికితోడు అత్యధికంగా రాయితీలు అందించడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపారని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ అన్నారు. టాటా మోటర్స్, హోండా కార్స్‌ సేల్స్ మాత్రం కాస్త పెరిగాయి. టాటా మోటార్స్ సేల్స్ 32 శాతం పెరిగి 39,152 వాహనాల నుంచి 57,710 కార్లకు పెరిగితే, 29 శాతం సేల్స్ పెంచుకున్న హోండా గతేడాది 10,010 కార్లు విక్రయిస్తే గత నెలలో 14,187 వెహికల్స్ అమ్మినట్లు రికార్డులు చెబుతున్నాయి. 

ఇతర పోటీ సంస్థలైన హ్యుండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటాల అమ్మకాలు మరింత పడిపోయాయి. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాల విక్రయాల పతనం పడిపోకపోవడమే ఆ సంస్థకు ఉపశమనం. 

మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ విక్రయాల పతనాన్ని 11 శాతానికి పరిమితం చేసుకున్నది. 2018 అక్టోబర్ నెలలో 55,350 కార్లను మాత్రమే విక్రయించిన మహీంద్రా.. ఈ ఏడాది 49,193 కార్లకే పరిమితమైంది. గత సెప్టెంబర్ నెలలో 21 శాతం మహీంద్రా సేల్స్ పడిపోయాయి. 

ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు మెరుగైన ప్రదర్శన  గావించిన హ్యుండాయ్ అమ్మకాలు కూడా 2.2 శాతం పడిపోయాయి. ప్యాసింజర్, కమర్షియల్ వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకొనడంతో అమ్మకాలు టాప్ గేర్‌లో దూసుకుపోయాయని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఆఫ్ సేల్స్ మార్కెటింగ్ విజయ్ రామ్ నక్రా తెలిపారు. 

టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 6 శాతం పడిపోయాయి. ఈ పండుగ సీజన్‌లో వినియోగదారుల డిమాండ్ ఆశావాదంగా ఉన్నదని, ముఖ్యంగా ధంతేరస్, దీపావళి పండుగల సందర్భంగా వాహనాలు అత్యధికంగా అమ్ముడయ్యాయని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం) డిప్యూటీ ఎండీ ఎన్ రాజా పేర్కొన్నారు. 

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ గతేడాది అక్టోబర్ నెలలో 12,606 కార్లు విక్రయిస్తే, గత నెలలో 11,866 వాహనాలతోనే సరిపెట్టుకున్నది. అంతకుముందు సెప్టెంబర్ నెలలో 10,203 వాహనాలు మాత్రమే విక్రయించింది.

aslo read హ్యుందాయ్ ఐ20 కొత్త మోడల్....ధర ఎంతో తెలుసా?

మరోవైపు టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన విక్రయాలు 18,290 నుంచి 13,169లకు పడిపోయాయి. క్రితం ఏడాదితో పోలిస్తే 26% తగ్గినట్లు అయ్యాయి. హోండా కార్స్ అమ్మకాలు కూడా ఏడాది ప్రాతిపదికన 29.44% తగ్గి 10,010లకు జారుకున్నాయి. ఇటీవల దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రవేశించిన కొరియాకు చెందిన ఎంజీ మోటర్స్ ఏకంగా 3,536ల యూనిట్లను విక్రయించింది.

కార్లతోపాటు ద్విచక్ర వాహన సంస్థలకూ నిరాశే మిగిలింది. గత నెలలో దిగ్గజం హీరో మోటోకార్ప్ సేల్స్ 18.43 శాతం పడిపోయి 5,99,248లకు జారుకున్నాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో సంస్థ 7,34,668ల అమ్మకాలు జరిపింది. బజాజ్ సేల్స్ కూడా 13 శాతం తగ్గి 2,78,776లకు, టీవీఎస్ 25.45 శాతం పతనం చెందాయి.

విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ..మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్యూ5, క్యూ7 ధరలను రూ.6.02 లక్షల వరకు తగ్గించింది. దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన పదేళ్లు పూర్తైన సందర్భంగా ఈ ప్రత్యేక రాయితీలు స్వల్పకాలం పాటు మాత్రమే అమలులోకి రానున్నాయి.
 
ఈ రెండు కార్లను ఆడి 2009లో దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో క్యూ5 పెట్రోల్, డీజిల్ రకం కారు రూ.49.99 లక్షలకు లభించనున్నది. ప్రస్తుతం ఇది రూ.55.8 లక్షలుగా ఉన్నది. 

అలాగే క్యూ7 పెట్రోల్ వెర్షన్ రూ.4.83 లక్షలు తగ్గించడంతో ధర రూ.68.99 లక్షలకు దిగిరానున్నది. తగ్గించకముందు ఇది రూ.73.82 లక్షలుగా ఉన్నది. క్యూ7 డీజిల్ రకం రూ.6.02 లక్షలు కోత విధించడంతో రూ.71.99 లక్షలకు తగ్గనున్నది.
 

click me!