పాత వాహనాల కోసం వెహికిల్ స్క్రాప్ పాలసీ: పార్లమెంటులో ప్రకటించిన ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి..

By S Ashok Kumar  |  First Published Mar 20, 2021, 11:10 AM IST

 కొత్త వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ పై వివరాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.  ఈ స్క్రాపేజ్ పాలసీ గురించి మీరు తెలుసుకోవలసిన  ముఖ్యమైన విషయాలు ఏంటంటే..


భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ పై వివరాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.  ఈ స్క్రాపేజ్ పాలసీ గురించి మీరు తెలుసుకోవలసిన  ముఖ్యమైన విషయాలు ఏంటో ఇక్కడ చూడండి..

  • ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకపోవడం అంటే 15 సంవత్సరాలు పైబడిన వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్ గా రద్దు చేయబడుతుంది అని గడ్కరీ చెప్పారు. 
  • ఒక ప్రైవేట్ వాహనం 20 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ చేయబడుతుంది, అలాగే రిజిస్ట్రేషన్ రేనివల్ కోసం ఫిట్నెస్ సర్టిఫికేట్ అవసరం.
  • పాత వాహనాల యజమానులను రిజిస్టర్డ్ స్క్రాప్ కేంద్రాల ద్వారా వాహనాలను  స్క్రాప్ చేయడానికి ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రణాళిక అని నితిన్  గడ్కరీ చెప్పారు.

also read 

  • కొత్త వెహికిల్ స్క్రాప్ పాలసీ ముఖ్యంగా కాలుష్యాన్ని తగ్గించడానికి, రిజిస్టర్డ్ స్క్రాపింగ్ కేంద్రాల ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించడం, కొత్త వాహనాల డిమాండ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు.
  • స్క్రాపింగ్ విధానం వల్ల సుమారు 10వేల కోట్ల కొత్త పెట్టుబడి ఏర్పడి 35వేల  ఉద్యోగాలు లభిస్తాయని నితిన్ గడ్కరీ తెలిపారు.
  • పాత వాహనం కోసం స్క్రాప్ సెంటర్ అందించే ప్రోత్సాహకం స్క్రాప్ విలువ కొత్త వాహనం ధరలో 4 నుండి 6 శాతం ఉంటుందని అంచనా. అదనంగా కొత్త ప్రైవేట్ వాహనాలకు 25 శాతం వరకు, కొత్త వాణిజ్య వాహనాలకు 15 శాతం వరకు రహదారి-పన్ను మినహాయింపు ఉంటుంది. ఇంకా స్క్రాపింగ్ సర్టిఫికెట్‌పై 5 శాతం తగ్గింపు లభిస్తుంది.

Latest Videos

click me!