autoexpo 2023:టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 300.. సెకండ్స్ లోనే టాప్ స్పీడ్.. దీని ధర ఎంతో తెలుసా..?

By asianet news telugu  |  First Published Jan 16, 2023, 5:26 PM IST

ఈ SUV డిజైన్ ల్యాండ్ క్రూయిజర్ సిగ్నేచర్ డిజైన్ లాగానే ఉంటుంది. అంతేకాదు సరికొత్త ఫ్రంట్ గ్రిల్, స్లీక్ హెడ్‌ల్యాంప్‌లు, స్క్వేర్డ్ ఆఫ్ వీల్ ఆర్చ్‌లతో పాటు A అండ్ D పిల్లర్‌లలో కనిపించే చిన్న చిన్న మార్పులను పొందుతుంది.
 


ఆటో ఎక్స్‌పో 2023లో జపనీస్ కార్ కంపెనీ టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300ని పరిచయం చేసింది, ఈ కార్ చాలా శక్తివంతమైన ఎస్‌యూ‌విలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కంపెనీ ప్రవేశపెట్టిన ఈ ఎస్‌యూవీ ప్రత్యేకతలు ఏంటి అంటే..

డిజైన్ ఎలా ఉందంటే 
ఈ SUV డిజైన్ ల్యాండ్ క్రూయిజర్ సిగ్నేచర్ డిజైన్ లాగానే ఉంటుంది. అంతేకాదు సరికొత్త ఫ్రంట్ గ్రిల్, స్లీక్ హెడ్‌ల్యాంప్‌లు, స్క్వేర్డ్ ఆఫ్ వీల్ ఆర్చ్‌లతో పాటు A అండ్ D పిల్లర్‌లలో కనిపించే చిన్న చిన్న మార్పులను పొందుతుంది.

Latest Videos

undefined

ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే
ఈ SUVలో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించారు. దీనితో పాటు, ఇందులో ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, హీటెడ్ స్టీరింగ్, జే‌బి‌ఎల్ K14 ప్రీమియం ఆడియో సిస్టమ్, ఆపిల్ అండ్ ఆండ్రాయిడ్ కార్ ప్లే, మూన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఆఫ్‌రోడింగ్‌ 
టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 ఆఫ్-రోడింగ్ కోసం ఒక గొప్ప ఎస్‌యూ‌వి. ఆఫ్-రోడింగ్ కోసం  మల్టీ-టెర్రైన్ మోడ్‌తో పాటు స్టాండర్డ్‌గా 4x4ని పొందుతుంది. అలాగే, TNGA F ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది.

ఇంజిన్ ఎలా ఉందంటే 
ఈ SUV 3.3-లీటర్ V6 టర్బో డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఎస్‌యూ‌వి ఇంజన్ 403 బి‌హెచ్‌పి పవర్, 700 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 10-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో  వస్తుంది. ఈ ఇంజన్ కారణంగా, ఈ SUV కేవలం 6.7 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది.

 పొడవు ఇంకా వెడల్పు
ల్యాండ్ క్రూయిజర్ 300 పొడవు 4985 ఎం‌ఎం. దీని వెడల్పు 1980 ఎం‌ఎం, ఎత్తు 1943 ఎం‌ఎం. దీని వీల్ బేస్ 2850 ఎం‌ఎం.

సేఫ్టీ ఎలా ఉందంటే 
ఈ ఎస్‌యూవీలో కూడా భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నారు.  10 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, క్రాల్ కంట్రోల్, టర్న్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్ కంట్రోల్, యాంటీ స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్, TPMS, ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ ఇంకా కార్ స్టార్ట్ ఫీచర్‌ను కూడా పొందుతుంది.

ధర ఎంతంటే 
మీడియా నివేదికల ప్రకారం, దీని బుకింగ్ ఇండియాలో ప్రారంభమయ్యాయి. ఈ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.17 కోట్లు. ముందుగా 10 లక్షలు చెల్లించి ప్రీ బుక్ చేసుకోవచ్చు. అయితే దీని మొదటి బ్యాచ్ బుకింగ్ పూర్తయింది. అయితే, దీనికి సంభంధించి కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
 

click me!