ఆటో ఎక్స్‌పో 2023లో భారతదేశపు అతి పొడవైన ఎలక్ట్రిక్ ఇంటర్‌సిటీ బస్.. ఇంకా మరెన్నో కొత్త వాహనాల పరిచయం..

By asianet news telugu  |  First Published Jan 11, 2023, 4:56 PM IST

ఐషర్ బ్రాండ్ భారతదేశపు అతి పొడవైన 13.5 మీటర్ల ఎలక్ట్రిక్ ఇంటర్‌సిటీ కోచ్ అండ్ ఐషర్ ప్రో 2049 ఎలక్ట్రిక్ 4.9టి జివిడబ్ల్యు ట్రక్ లను బుధవారం చూపించింది. ఐషర్ సుక్సెసర్ EV ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన ఐషర్ ప్రొ 2049 ఎలక్ట్రిక్ 4.9T జివిడబ్ల్యు ట్రక్ దూర ప్రాంతాలకు ఆర్థిక ఇంకా స్వచ్ఛమైన రవాణా కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడింది.


వోల్వో గ్రూప్  అండ్ ఐషర్ మోటార్స్ జాయింట్ వెంచర్  వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ (VECV) ఆటో ఎక్స్‌పో 2023లో కంప్లీట్ రేంజ్ ఫ్యూచర్ రెడీ మొబిలిటీ సొల్యూషన్‌లను ప్రదర్శించింది. భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలలో బస్సు ఇంకా ట్రక్కు రవాణా ఆధునికీకరణను నడపడంలో VECV నాయకత్వాన్ని కొనసాగిస్తూ ప్రత్యామ్నాయ ఫ్యూయెల్ ప్రోటోటైప్  కూడా ప్రదర్శించింది.

ఐషర్ బ్రాండ్ భారతదేశపు అతి పొడవైన 13.5 మీటర్ల ఎలక్ట్రిక్ ఇంటర్‌సిటీ కోచ్ అండ్ ఐషర్ ప్రో 2049 ఎలక్ట్రిక్ 4.9టి జివిడబ్ల్యు ట్రక్ లను బుధవారం చూపించింది. ఐషర్ సుక్సెసర్ EV ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన ఐషర్ ప్రొ 2049 ఎలక్ట్రిక్ 4.9T జివిడబ్ల్యు ట్రక్ దూర ప్రాంతాలకు ఆర్థిక ఇంకా స్వచ్ఛమైన రవాణా కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడింది.

Latest Videos

undefined

ఐషర్ ప్రో 8055 LNG/CNG ట్రక్ కూడా ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది. దీనిని దూర ప్రయాణాల కోసం రవాణా అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఎల్‌ఎన్‌జిలో ఎక్కువ దూరం ప్రయాణించే ఐషర్ ప్రో 8055 స్విచ్ టచ్‌తో సిఎన్‌జి ఇంధనానికి మారగలదు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న సి‌ఎన్‌జి డిస్ట్రిబ్యూషన్స్  నెట్‌వర్క్ ప్రయోజనాన్ని పొందవచ్చు. 

వోల్వో ట్రక్స్ వోల్వో ఎఫ్‌ఎం ఎల్‌ఎన్‌జి 420 4X2 ట్రాక్టర్‌ను కూడా ప్రదర్శించింది, ఇది దూర హబ్-టు-హబ్ కార్యకలాపాలలో ప్రముఖ ఇ-కామర్స్ ఆపరేటర్‌లతో  ట్రయల్స్‌లో ఉంది. వోల్వో LNG సొల్యూషన్ ప్రత్యేకమైన డీజిల్-సైకిల్ టెక్నాలజీపై ఆధారపడుతుంది, ఇది పెట్రోల్ లేదా ఆటో-సైకిల్ టెక్నాలజీతో పోలిస్తే 15-20 శాతం ఫ్యూయెల్ ఎకానమీ పెంచుతుంది.

వోల్వో అత్యాధునిక 15ఎం వోల్వో 9600 లగ్జరీ కోచ్‌ను పరిచయం చేసింది. అంతర్జాతీయంగా ఇష్టపడే వోల్వో 9600 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన ఈ కోచ్ ప్రత్యేకమైన ప్రయాణ అనుభవం కోసం ఫస్ట్ క్లాస్ లగ్జరీ సీటింగ్‌ను అందిస్తుంది.

ఆటో ఎక్స్‌పో 2023లో  VECV ప్రోటోటైప్ ఐషర్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ట్రక్ అండ్ హైడ్రోజన్ ICE టెక్నాలజీ ఇంజిన్‌ను కూడా ప్రదర్శించింది. ఈ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజి భారత ప్రభుత్వం  గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు అనుగుణంగా ఉన్నాయి ఇంకా జీరో టెయిల్-పైప్ ఉద్గారాలకు మంచి విధానాన్ని అందిస్తాయి.

అన్ని ఐషర్ అండ్ వోల్వో ట్రక్కులు ఇంకా బస్సులతో వైడ్ రేంజ్ సపోర్ట్ సోల్యూషన్స్ అందించబడతాయి. పరిశ్రమ-మొదటి 100 శాతం కనెక్ట్ చేయబడిన ఫ్లీట్ అండ్ అత్యాధునిక కేంద్రాల ద్వారా ప్రారంభించబడిన ఈ యాప్-ఆధారిత స్మార్ట్ సపోర్ట్ సొల్యూషన్‌లు అధిక ఉత్పాదకత ఇంకా సామర్థ్యాన్ని నిర్ధారించడానికి, వాటి కార్బన్ ఫూట్ ప్రింట్ తగ్గించడానికి ట్రక్కులు, బస్సులు, డ్రైవర్లు ఇంకా ఫ్లిట్స్ నిర్వహిస్తాయి. 

ఈ సందర్భంగా VECV ఎం‌డి & సి‌ఈ‌ఓ వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ, "వోల్వో గ్రూప్ అండ్ ఐషర్ మోటార్స్ JVగా VECV భారతదేశంలో అధునాతన BS VI టెక్నాలజి రూపొందించి, పరిచయం చేసింది. ఐషర్ అండ్ వోల్వో ట్రక్కులు ఇంకా బస్సులు మా ద్వారా తయారు చేయబడ్డాయి. మా కస్టమర్‌లకు ఉత్పాదకత ఇంకా సమయపాలన గురించి మా వాగ్దానాన్ని అందించడంలో మాకు సహాయపడే 100 శాతం అనుసంధానిత పర్యావరణ వ్యవస్థ. CV పరిశ్రమ విద్యుదీకరణ ఇప్పటికే బస్సులతో ప్రారంభించబడింది. LNG, ఇథనాల్ ఇంకా హైడ్రోజన్‌తో సహా ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిపించాల్సిన అవసరం ఉందని మేము విశ్వసిస్తున్నాము" అని అన్నారు.

click me!