ఎలక్ట్రిక్ వాహనాల కోసం లిథియం-అయాన్ (లి-అయాన్) బ్యాటరీల తయారీ కోసం తోషిబా గ్రూప్ సంస్థ గురువారం కేరళ ప్రభుత్వంతో సంతకం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ప్రకటన ప్రకారం తోషిబా గ్రూప్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం లిథియం-అయాన్ (లి-అయాన్) బ్యాటరీల తయారీ కోసం కేరళ ప్రభుత్వంతో ఒప్పంద సంతకం చేసింది.ఎలక్ట్రిక్ వాహనాల కోసం లిథియం-అయాన్ (లి-అయాన్) బ్యాటరీల తయారీ కోసం తోషిబా గ్రూప్ సంస్థ గురువారం కేరళ ప్రభుత్వంతో సంతకం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
also read రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి కొత్త ఫ్లాట్-ట్రాక్ బైక్...
ఈ ఒప్పందం ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఒక ఉన్నత స్థాయి రాష్ట్ర ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో భాగంగా జపాన్ రాజధాని అయిన టోక్యోలో నిర్వహించిన పెట్టుబడి సదస్సులో ఈ సంతకం చేశారు.టోక్యోలోని భారత రాయబార కార్యాలయంలో 150 మంది జపాన్ పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన కేరళ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక సదస్సులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రసంగించారు.
ఇద్దరు రాష్ట్ర మంత్రులు, సీనియర్ బ్యూరోక్రాట్లు ఉన్న విజయన్ ప్రతినిధి బృందం దక్షిణ కొరియాలో పర్యటించి డిసెంబర్ 4 న భారతదేశానికి తిరిగి రానున్నారు. 2022 నాటికి 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను రహదారిపై నడిపించాలని దక్షిణాది రాష్ట్రం యోచిస్తోంది. ప్రభుత్వం ఇందుకోసం ₹ 12కోట్ల ఇ-మొబిలిటీ ఫండ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
also read బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్....ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి కొత్త బైక్స్....
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే కార్యక్రమాలలో కేరళ ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రయత్నాన్ని తిరువనంతపురం నుండి మొదలుపెట్టే యోచనలో ఉన్నారు. అలాగే ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు పన్ను మినహాయింపులు, రాయితీలు ఇస్తామని రాష్ట్రం ప్రభుత్వం తెలిపింది.