రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి కొత్త ఫ్లాట్-ట్రాక్ బైక్‌...

By Sandra Ashok Kumar  |  First Published Nov 29, 2019, 1:52 PM IST

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సిసి ఫ్లాట్-ట్రాక్ మోటార్‌ బైక్ ను ఆవిష్కరించింది. ఇది కొత్త ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 లను కూడా ఆవిష్కరించింది.


రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయ ఎఫ్‌టి 411 బైక్   విడుదల చేసిన తరువాత ఇప్పుడు అదే  ఫ్లాట్ ట్రాక్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్  తన 650 సిసి ప్లాట్‌ఫామ్ ఆధారంగా కొత్త ఫ్లాట్-ట్రాక్ బైక్‌ను విడుదల చేసింది.రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సిసి ఫ్లాట్-ట్రాక్ మోటార్‌ బైక్ ను ఆవిష్కరించింది.

also read  బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్....ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి కొత్త బైక్స్....

Latest Videos

ఇది కొత్త ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 లను కూడా ఆవిష్కరించింది. UK లోని సంస్థ యొక్క  టెక్నికల్ సెంటర్ లో ఫ్లాట్-ట్రాకర్ బైక్ వెల్లడైంది.రాయల్ ఎన్ఫీల్డ్ 650 ఫ్లాట్-ట్రాకర్ బైక్ కి కొత్త ఫ్రేమ్‌ను అమర్చారు.

దీనిని రాయల్ ఎన్‌ఫీల్డ్ సొంతం చేసుకున్నా హారిస్ పెర్ఫార్మెన్స్  తయారు చేసింది. బాక్స్-సెక్షన్ స్వింగార్మ్ కూడా కొత్తది. ఉత్పత్తి మోడళ్లలో ట్విన్ షాక్ అబ్జార్బర్స్ స్థానంలో బైక్ ఓహ్లిన్స్ మోనోషాక్‌ను బిగించారు. అలాగే ఇందులో ఎస్ & ఎస్ పర్ఫామెన్స్ బిగ్ బోర్ కిట్ ఉంది, మెరుగైన పర్ఫామెన్స్  కోసం బైక్ పాడ్ ఎయిర్ ఫిల్టర్లలను  కూడా అమర్చరు.

also read మార్కెట్లో బీఎస్-6 వెహికల్స్ హల్‌చల్...తాజాగా కొత్త.. క్లాసిక్ స్కూటీస్..

ఇతర AMA ఫ్లాట్-ట్రాక్ బైక్‌ల లాగే దీనికి అప్‌స్వీప్ట్ ఎగ్జాస్ట్ కూడా ఈ బైక్‌లో ఉంది. బైక్‌  టైర్ సైజ్ 18 అంగుళాల నుండి 19 అంగుళాలకు టైర్ సైజ్ అంటే ఒక అంగుళం పెరిగింది. ఫ్లాట్-ట్రాక్ రేసింగ్ బైక్  అవసరాలకు అనుగుణంగా హ్యాండిల్‌బార్లు, ఫుట్‌పెగ్‌లు, యోక్స్ వంటి భాగాలను అనుకూలంగా నిర్మించారు. FT 411 మరియు ట్విన్ ట్రాకర్ రెండూ కొన్ని మార్పులతో ఉత్పత్తికి వచ్చే అవకాశం ఉంది.
 

click me!