Tata Motors offers: టాటా మోటార్స్ కార్లపై భారీ ఆఫ‌ర్లు.. ఈ నెల మాత్ర‌మే ఛాన్స్‌..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 10, 2022, 03:31 PM IST
Tata Motors offers: టాటా మోటార్స్ కార్లపై భారీ ఆఫ‌ర్లు.. ఈ నెల మాత్ర‌మే ఛాన్స్‌..!

సారాంశం

 దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కార్ల విక్రయాలు పెంచుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటించింది. గత ఏడాది కొవిడ్ వల్ల ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగనందున.. వినియోగదారులను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.

స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) భారతదేశంలోని టియాగో, టిగోర్, హారియర్, సఫారీ మోడళ్లతో సహా ఎంపిక చేసిన మోడళ్లపై మార్చి నెలకుగాను అనేక రకాల ఆఫర్లను ప్రకటించింది. ఈ తగ్గింపులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ అండ్ లాయల్టీ డిస్కౌంట్ రూపంలో అందించనుంది.  అయితే టాటా  కంపెనీ  టాటా నెక్సాన్ (Nexon), టియాగో(Tiago), హారియర్( Harrier), సఫారి (Safari) వంటి మోడళ్లపై ఈ తగ్గింపును అందిస్తోంది. మోడళ్లను బట్టి రూ. 85 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. 


టాటా సఫారి
2021 టాటా సఫారి మోడల్‌పై రూ. 60,000 వరకు తగ్గింపు రానుంది. టాటా సఫారి 2022 మోడల్‌పై రూ. 40,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ కారుపై ఎలాంటి కార్పోరేట్‌ తగ్గింపు రావడం లేదు. టాటా సఫారీ ధర  రూ. 14.99 నుంచి రూ. 23.29 లక్షలు గా ఉంది.

టాటా హారియర్
టాటా మోటార్స్‌ అందిస్తోన్న ప్రసిద్ధ ఎస్‌యూవీల్లో టాటా హారియర్ ఒకటి. ఈ కారు కొనుగోలుపై రూ. 85,000 వరకు విస్తృతమైన తగ్గింపును టాటా అందిస్తోంది . 2021 టాటా హారియర్ మోడల్‌పై రూ. 60,000  తగ్గింపు రానుంది. ఇందులో రూ. 20,000 నగదు ప్రయోజనాలు లభించనున్నాయి. ఇక 2022 మోడల్‌పై రూ. 40,000 ఎక్స్చేంజ్ ప్రయోజనాలు కొనుగోలుదారులకు అందిస్తోంది. ఈ రెండు మోడళ్లకు రూ. 25,000 వరకు కార్పొరేట్ తగ్గింపు కూడా వస్తోంది. టాటా హారియర్ ధర  రూ. 14.49 నుంచి రూ. 21.70 లక్షలుగా ఉంది.

టాటా ఆల్ట్రోజ్
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కారు టాటా ఆల్ట్రోజ్‌పై కొనుగోలుదారులు రూ. 10,000 వరకు తగ్గింపును పొందవచ్చు. టర్బో పెట్రోల్ వేరియంట్‌పై రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపును పొందవచ్చు. సాధారణ పెట్రోల్ ఇంజన్ రూ. 7,500 తగ్గింపు రానుంది. మారుతి సుజుకి బాలెనో లేదా హ్యుందాయ్ ఐ20 పోటీగా ఈ కారు నిలుస్తోంది. టాటా ఆల్ట్రోజ్ ధర  రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.69 లక్షలుగా ఉంది.

టాటా టిగోర్
టాటా మోటార్స్‌ స్టైలిష్ సెడాన్ టిగోర్  రూ. 35,000 తగ్గింపుతో రానుంది. 2021, 2022 టాటా టిగోర్‌ మోడల్స్‌పై వరుసగా రూ. 25,000, రూ. 20,000  ఎక్స్‌ఛేంజ్ ప్రయోజనాలను కలిగి  ఉంది. ఈ కారుపై రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు కూడా రానుంది. టాటా టిగోర్‌ ధర  రూ. 5.79 నుంచి రూ. 8.41 లక్షలు  గా ఉంది.

టాటా టియాగో
టాటా టియాగో కొనుగోలుపై రూ. 30,000 వరకు తగ్గింపును అందిస్తోంది టాటా మోటార్స్‌  . ఇందులో 2021 మోడల్‌పై  రూ. 25వేల వరకు, 2022 మోడల్‌పై రూ. 20వేల వరకు తగ్గింపు ఉంటుంది.ఈ కారుపై రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు కూడా వర్తిస్తుంది. టాటా టియాగో కారు ధర  రూ. 5.19 నుంచి రూ. 7.64 లక్షలుగా ఉంది. 

టాటా నెక్సాన్
పెట్రోల్/డీజిల్ వేరియంట్ల టాటా నెక్సాన్ రూ. 25,000 వరకు తగ్గింపును పొందుతుంది. 2021 డీజిల్ మోడల్‌పై కొనుగోలుదారులు రూ. 15,000 తగ్గింపును పొందుతారు.  నెక్సాన్ పెట్రోల్ వేరియంట్‌పై రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తుంది. కాగా డీజిల్ వేరియంట్‌పై రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు రానుంది. టాటా నెక్సాన్ ధర  రూ. 7.39 నుంచి రూ. 13.73 లక్షలు గా ఉంది. అయితే ఈ కార్లపై లభించే తగ్గింపులు, పలు ఆఫర్స్‌ వివిధ రాష్ట్రాలలో మారుతూ ఉంటాయని సంస్థ పేర్కొంది. 


 

PREV
click me!

Recommended Stories

Jeep Grand Cherokee : ఈ కారుపై ఇస్తున్న డిస్కౌంట్ మరో కారే కొనొచ్చు... ధర ఎంత తగ్గిందో తెలుసా?
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు