aprilia RS660: లిమిటెడ్ ఎడిషన్ కలర్ ఆప్షన్స్ తో లాంచ్.. రేసింగ్ బైక్ గేర్‌బాక్స్‌తో మరింత స్పోర్టీగా..

Ashok Kumar   | Asianet News
Published : Mar 10, 2022, 02:15 PM IST
aprilia RS660: లిమిటెడ్ ఎడిషన్ కలర్ ఆప్షన్స్ తో లాంచ్..  రేసింగ్ బైక్ గేర్‌బాక్స్‌తో మరింత స్పోర్టీగా..

సారాంశం

కొత్తగా ప్రవేశపెట్టిన ఈ మోడల్ వెర్షన్ AMA నేషనల్ రోడ్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో కంపెనీ సాధించిన విజయాన్ని గుర్తుచేసింది. కొత్త మోడల్ స్టార్స్ అండ్ స్ట్రైప్స్ పెయింట్ జాబ్‌తో ప్రధానంగా తెలుపు, ఎరుపు, నీలం రంగులలో వస్తుంది. 

ఇటాలియన్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ అప్రిలియా  ఆర్‌ఎస్660 (Aprilia RS660) లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్‌లో ప్రత్యేక పెయింట్ స్కీమ్‌తో వస్తుంది. విశేషమేమిటంటే ప్రపంచవ్యాప్తంగా 1500 యూనిట్లను మాత్రమే విక్రయించనుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ మోడల్ వెర్షన్ AMA నేషనల్ రోడ్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో కంపెనీ సాధించిన విజయాన్ని గుర్తుచేసింది. కొత్త మోడల్ స్టార్స్ అండ్ స్ట్రైప్స్ పెయింట్ జాబ్‌తో ప్రధానంగా తెలుపు, ఎరుపు, నీలం రంగులలో వస్తుంది. 

కొత్త అప్ డేట్స్ 
కొత్త పెయింట్ స్కీమ్ కాకుండా బైక్ కి ఇన్‌వర్టెడ్ షిఫ్ట్ ప్యాటర్న్‌తో కూడిన గేర్‌బాక్స్ లభిస్తుంది. అప్‌షిఫ్ట్ కోసం క్రిందికి నెట్టండి ఇంకా డౌన్‌షిఫ్ట్ కోసం పైకి నెట్టండి. ఈ గేర్‌బాక్స్ ముఖ్యంగా రేసింగ్ బైక్‌లలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఇతర హై లెట్ అప్‌డేట్‌ల గురించి మాట్లాడితే మెరుగైన ఎయిర్ ప్రవాహం కోసం పెద్ద ఫ్రంట్ ఫెయిరింగ్‌ను పొందుతుంది. బైక్  ఎక్స్టీరియర్ రూపాన్ని మరింత ఆకర్షణీయంగా చేయడానికి బ్యాక్ సీటు కౌల్ ఉపయోగించారు.

ఇంజిన్ అండ్ ఫీచర్లు
ఈ మార్పులు కాకుండా,  బైక్ కి ఎక్కువ లేదా తక్కువ లేకుండా అలాగే ఉంటుంది. దీనికి 659cc లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ని పొందుతుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 10,5000 rpm వద్ద 100bhp శక్తిని, 8500rpm వద్ద 67Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ కోసం 6-స్పీడ్ యూనిట్ను పొందుతుంది. బైక్ APRC (అప్రిలియా పెర్ఫార్మెన్స్ రైడ్ కంట్రోల్), 6-యాక్సిస్ IMUతో త్రీ-లెవెల్ కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, అడ్జస్టబుల్ వీలీ కంట్రోల్, ఇంజన్ బ్రేక్ కంట్రోల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు వంటి ఇతర ఫీచర్స్ పొందుతుంది. 

ధర, రంగులు
Aprilia RS660ని ఆగస్ట్ 2021లో రూ. 13.39 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో భారత మార్కెట్లో విడుదలైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ బైక్ లావా రెడ్, బ్లాక్ అపెక్స్, యాసిడ్ గోల్డ్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

ఈ బైక్ హోండా CBR650R, యమాహా YZF-R7, రాబోయే కవాసకి నింజా 700R వంటి బైక్లతో పోటీపడుతుంది . వార్తల ప్రకారం, కవాసకి నింజా 700R ప్రస్తుతం ఉత్పత్తి ప్లాంట్లో సిద్ధమవుతోంది.
 

PREV
click me!

Recommended Stories

Jeep Grand Cherokee : ఈ కారుపై ఇస్తున్న డిస్కౌంట్ మరో కారే కొనొచ్చు... ధర ఎంత తగ్గిందో తెలుసా?
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు