రేపే టాటా మోటార్స్ మోస్ట్ ఆవేటెడ్ కొత్త ఎలక్ట్రిక్ కార్ ఆవిష్కరణ.. ఏం ఆశించవచ్చు అంటే ?

By asianet news telugu  |  First Published Apr 28, 2022, 5:28 PM IST

టాటా మోటార్స్ నుండి రాబోయే ఎలక్ట్రిక్ వాహనాన్ని 'ఒక కొత్త మోడల్' అనే మెసేజ్ తో టీజ్ చేసింది. రేపు ఆవిష్కరించనున్న కారు లాంగ్-రేంజ్ నెక్సన్ లేదా అల్తోజ్ ​​ఈ‌వి కావచ్చునని ఊహిస్తున్నారు. మరోవైపు తయారీ సంస్థ సరికొత్త  అప్ కమింగ్ ఉత్పత్తి కావొచ్చు.


మూడు వారాల క్రితం టాటా మోటార్స్  కర్వ్ (Curvv) అనే ఎలక్ట్రిక్  ఎస్‌యూ‌వి కాన్సెప్ట్‌ను పరిచయం చేయనుంది, రాబోయే రెండేళ్లలో  ఈ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తామని వాగ్దానం చేసింది. దేశంలోని ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో 90 శాతం వాటా  ఉన్న భారతీయ తయారీ సంస్థ ఇప్పుడు ఏప్రిల్ 29వ తేదీన కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే ఈ ఆవిష్కరణ  సంధర్బంగా ఏం ప్రత్యేకత ఉంటుందో ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు, కానీ  మనం ఏం ఆశించవచ్చో చూద్దాం..

టాటా మోటార్స్ నుండి రాబోయే ఎలక్ట్రిక్ వాహనాన్ని 'ఒక కొత్త మోడల్' అనే మెసేజ్ తో టీజ్ చేసింది. రేపు ఆవిష్కరించనున్న కారు లాంగ్-రేంజ్ నెక్సన్ లేదా అల్తోజ్ ​​ఈ‌వి కావచ్చునని ఊహిస్తున్నారు. మరోవైపు తయారీ సంస్థ సరికొత్త  అప్ కమింగ్ ఉత్పత్తి కావొచ్చు.

Latest Videos

undefined

ఒకవేళ ఆల్ట్రోజ్ EV అయితే కొలతల పరంగా భారతదేశంలోని అతి చిన్న EVగా చేస్తుంది, అయితే ఇప్పటికీ భారతదేశంలో అత్యంత బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు రూ. 11.99 లక్షలతో ఉన్న టిగోర్ EV కంటే ఎక్కువగా ఉంటుంది. ఆల్ట్రోజ్ EV 2020 ఆటో ఎక్స్‌పోలో మొదటిసారిగా ఆవిష్కరించారు. ఈ కారు దేశంలో అత్యంత ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి.

టాటా మోటార్స్ ఒక రోజులో 101 ఎలక్ట్రిక్ వాహనాలు
అంతేకాకుండా టాటా మోటార్స్ రాబోయే ఐదేళ్లలో 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను వాగ్దానం చేసింది. కాబట్టి EV పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తానని వాగ్దానం చేయడంతో టాటా మోటార్స్ కొత్త Nexon EV పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో రేపు పరిచయం చేయవచ్చు. ఒకవేళ పరిచయం చేస్తే లాంగ్-రేంజ్ Nexon EV భారతదేశంలోనే అత్యంత పొడవైన స్వదేశీ ఎలక్ట్రిక్ కారు అవుతుంది.

ఊహాగానాలు ప్రకారం కొత్త నెక్సాన్ EV 40 kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందవచ్చని సూచిస్తున్నాయి, ఇంకా గణనీయంగా పెద్ద పవర్ ఫిగర్‌లను కూడా వాగ్దానం చేస్తుంది. పెద్ద Nexon EV భారతదేశంలోని పెద్ద ఎలక్ట్రిక్ SUVలతో పోటీపడుతుంది.
 

click me!